Friday, April 26, 2024
- Advertisement -

శ్రీముఖి, విష్ణుప్రియతో గొడవపై స్పందించిన వర్షిణి..!

- Advertisement -

‘చందమామ కథలు’ ‘లవర్స్’ ‘కాయ్ రాజా కాయ్’ తదితర సినిమాల్లో నటించినప్పటికి యాంకర్ వర్షిణికి పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే కొంచెం గ్యాప్ తర్వాత ‘పెళ్లిగోల’ అనే వెబ్ సిరీస్ ద్వారా ఈమెకు మంచి పేరు వచ్చింది. అటు తర్వాత యాంకర్ గా మారింది ఈ అందాల భామ. ‘పటాస్’ ‘ఢీ’ వంటి షోలతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది వర్షిణి.

ఇదిలా ఉండగా.. గత కొంతకాలంగా వర్షిణికి.. అలాగే ఆమె తోటి యాంకర్లు అయిన శ్రీముఖి, విష్ణు ప్రియలతో గొడవలు జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల పై తాజాగా స్పందించి క్లారిటీ ఇచ్చింది వర్షిణి. ఈ విషయం పై ఆమె స్పందిస్తూ.. ” శ్రీముఖి, విష్ణుప్రియ లతో నాకు గొడవలు ఉన్నట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు. అలా అని నాకు వాళ్లిద్ద‌రితో స్నేహం కూడా లేదు. ఏదో.. హాయ్, బై చెప్పుకోవడం తప్ప వారితో అంత సాన్నిహిత్యం ఏమీ లేదు.

ఇక ‘ఇప్పుడున్న యాంకర్లకు ర్యాంకులు ఇవ్వాల్సి వస్తే.. ఎవరికి ఏ ర్యాంక్ ఇస్తారు?’ అని వర్షిణి యాంకర్ ప్రశ్నించగా.. ‘సుమ‌కు 1, ఝాన్సీ2, శ్రీముఖి3, ర‌ష్మి4, అన‌సూయ‌5, ల ర్యాంకులు ఇచ్చి.. 6 నేను.! ఇక విష్ణుప్రియకు ఆఖరి ర్యాంక్’ ఇస్తున్నట్టు వర్షిణి తెలిపింది. ఈ క్రమంలో యాంకర్… ‘విష్ణుప్రియకు లాస్ట్ ర్యాంక్ ఇచ్చారేంటి?’ అని ప్రశ్నించగా.. ‘లేకపోతే లాస్ట్ ర్యాంక్ నాకు ఇచ్చుకోమంటారా ఏంటి? అంటూ సరదాగా వర్షిణి స్పందించింది.

టీవీ సీరియల్ నటి నవ్యకు కరోనా..!

బాలకృష్ణ పిలువు వేరే.. అలా అంటే కొట్టేస్తా : నగ్నం హీరోయిన్ కామెంట్స్

వర్మ ‘పవర్ స్టార్’ సినిమా హీరో దొరికేశాడు..!

శ్యామ్, సాయిసుధ కేసులో సంతకాన్ని మార్ఫింగ్.. కొత్త ట్విస్ట్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -