Tuesday, April 16, 2024
- Advertisement -

పొట్ట తగ్గట్లేదు అంటూ అద్దంని తిడుతున్న విష్ణు ప్రియా..!

- Advertisement -

ఈ మధ్యకాలంలో వచ్చిన విష్ణు ప్రియ యాంకర్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. కుర్రకారులో ఈమెకు మంచి క్రేజ్ ఉంది. లాక్ డౌన్‌లో వర్కౌట్స్ అంటూ నడుము అందాలతో కుర్రకారు మతులు పోగొట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇంట్లో ఉండి ‘అద్దం’తో అదరగొట్టే ప్రయత్నం చేసింది. ఈ అద్దాన్ని తాను ఎలా ఉపయోగిస్తుంది.. దానికి ఆ అద్దం వైపుగా ఆలోచించి ఎలా బాధపడుతుందనే కోణంలో స్కిట్ చేసి ఫేస్ బుక్‌లో వదిలింది విష్ణుప్రియ.

‘‘మిమ్మల్ని అందంగా చూపించే నేను.. మీకు మాత్రం అందంగా కనిపించను.. నా గురించి తక్కువ అంచనా వేయొద్దండోయ్.. నా సైజ్ ఎంత ఉన్నా క్రేజ్ కొండంతం.. ప్రపంచంలో ఎవ్వరైనా.. ఎంతటి గొప్పవారైనా.. నా ముందు ఆగాల్సిందే.. నన్ను చూడాల్సిందే’’ అంటూ అద్దం గురించి క్యూట్ గా ఇంట్రడ్యూస్ చేసింది విష్ణు. ఆడవాళ్లకి మందు ఎంత అవసరమో.. సారీ సారీ!! మగాళ్లకుమందు ఎంత అవసరమో.. ఆడవాళ్లకు అద్దం అంత అవసరం. ఇక నా పరిస్థితి ఆ ఇంట్లో ఎలా ఉంటుందో మీరే చూడండి అంటూ ఆ ఇంట్లోని ముగ్గురు ఆడవాళ్లతో అద్దం పడే పాట్లను చూపించింది. ఈ వీడియోలో విష్ణు ప్రియతో పాటు ఆమె చెల్లలు కూడా కనిపించింది. ఆమె పాచి మొహంతో అద్దం ముందు నిల్చొని.. బ్రష్ చేస్తూ ఉండటం అందుకు అద్దం ఫీల్ అవ్వడం.. ఇక విష్ణు ప్రియే ఆంటీగా డ్యుయెల్ రోల్ చేసింది.

ఇక విష్ణు ప్రియకు బాగా కలిసి వచ్చిన వర్కౌట్స్‌ను ఇందులోనూ వాడేసింది. హా వచ్చేసిందండీ.. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్.. ఇప్పుడెన్ని డ్రామాలు చేసిద్దో అంటూ తన డ్రామాలను ఒక్కొక్కటిగా తెగ చూపించేసింది. వర్కౌట్ అంటూ షర్ట్ పైకి ఎత్తి మరీ నాభి అందాలను అద్దంలో చూపించింది. ఎంత వర్కౌట్ చేసిన కానీ ఈ పొట్ట తగ్గడం లేదు ? ఈ అద్దం నిన్ను లావుగా చూపిస్తుందని.. ఐ హేట్ మిర్రర్ ఛీ అంటూ ఛీ కొట్టడంతో విష్ణు ప్రియపై అద్దం అలగడం.. నిజాన్ని నిజంగా చూపించే నిప్పులాంటి నన్ను అంటావా ? రోజు నైట్ కాగానే తింటూనే ఉంటుంది.. అర్థరాత్రి లేచి మరీ తింటుంది.. తినేదంతా తినేసి ఇప్పుడు నన్ను అంటుంది అంటూ అద్దం తెగ ఫీల్ కావడాన్ని ఇందులో చాలా ఫన్నీగా చూపించారు. ఆ వీడియోని మీరు కూడా చూసేయండి.

https://www.facebook.com/AnchorVishnuPriya/videos/864920577251113/

నన్ను లొంగ తీసుకునేందుకు ప్రయత్నించారు : రెజినా

తల్లితో సొంత ఊరు వెళ్లి సాయం చేసిన అనసూయ..!

గొప్ప మనసు చాటుకున్న మహేష్.. చిన్నారికి ప్రాణం పోశాడు..!

నేను కూడా చనిపోదాం అనుకున్నా : నందినీ రాయ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -