Wednesday, April 24, 2024
- Advertisement -

తెలుగులో అంధుడిగా నితిన్

- Advertisement -

హిందీలో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే నాయకా నాయికలుగా నటించిన అంధుదాన్ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమాలో హీరో అంధుడు. ఆ పాత్రను తెలుగులో నితిన్ చెయబోతున్నాడు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తెలుగు రీమేక్ రైట్స్ ను దక్కించుకున్నాడు. వయాకామ్ 18 వారు కూడా నిర్మాణ భాగస్వాములుగా ఉండనున్నారు.

హిందీలో హిట్ కొట్టిన సినిమాలు తెలుగులో, తెలుగులో హిట్ కొట్టిన సినిమాలు హిందీలో తియ్యడం ఎప్పటి నుండో జరుగుతుంది. కానీ నితిన్ అలాంటి ఛాలెంజింగ్ పాత్ర చెయ్యగలడా, ఒకవేళ విజయవంతంగా చేసినా కూడా ప్రేక్షకులు నితిన్ ని ఆ పాత్రలో చూడగాలరా అనేది చూడాలి. ఎందుకంటే అల్లరి చేసే పాత్రలు, హీరోయిజం చూపించే పాత్రలు చేసే నితిన్ ఇలాంటి కారెక్టర్ కి సరిపోతాడా. ఇంతకుముందు రాజ్ తరుణ్ కూడా ఒకసారి గుడ్డివాడి పాత్ర చేసి చేతులు కాల్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నితిన్ చేస్తోన్న ‘భీష్మ’ .. ‘రంగ్ దే’ సినిమాలు పూర్తయిన తరువాత, ఆయన హీరోగా ‘అంధాదున్’ రీమేక్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -