Thursday, April 25, 2024
- Advertisement -

అనిల్ తన కొడుకుకి ఎవరి పేరు పెట్టుకున్నాడంటే ?

- Advertisement -

మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ హిట్ అయింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న సమయంలోనే అనిల్ రావిపూడి భార్య ఓ మగబిడ్డకి జన్మనిచ్చింది. అప్పుడు ఆయన పొందిన ఆనందం అంతా ఇంతా కాదు.

ఆ సినిమా సక్సెస్ ఇచ్చిన ఆనందం .. ఆ సమయంలో ఆయన పొందిన అనుభూతి ఎప్పటికీ గుర్తుండేలా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ‘సరిలేరు నీ కెవ్వరు’ సినిమాలో మహేశ్ బాబు పాత్ర పేరు ‘అజయ్ కృష్ణ’. మహేశ్ పాత్రను డిజైన్ చేసిన కారణంగా ఆ పాత్ర జనంలోకి బాగా దూసుకెళ్ళింది.

ఆ పాత్ర నుంచే ‘అజయ్’ను తీసుకుని, ఆ పేరు పక్కన ‘సూర్యాంశ్’ ను జోడించాడు. అలా ఆయన తన కుమారుడికి ‘అజయ్ సూర్యాంశ్ ‘అని నామకరణం చేసినట్టుగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మహేశ్ బాబు పట్ల అభిమానం .. ఆ పాత్ర పట్ల ప్రేమ కారణంగానే తాను అలా చేశానని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -