Saturday, April 20, 2024
- Advertisement -

మహేష్ సినిమా నా వల్లే ప్లాప్ : అనిల్ రావిపూడి

- Advertisement -

మహేష్ బాబు కెరీర్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా ఆగడు. ఈ సినిమా ఎవరు ఊహించని రెంజ్ లో ప్లాప్ అయింది. అయితే ఈ సినిమా ప్లాప్ కి కారణం నేనే అంటున్నారు దర్శకుడు అలిల్ రావిపూడి.

ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నేను ఆగడు మూవీకి స్క్రిఫ్ట్ వర్క్ అందించాను. ఈ సినిమా వర్క్ జరుగుతుండగానే పటాస్ ఛాన్స్ వచ్చింది. దాంతో ఆగడు సెకండ్ ఆఫ్ అప్పటికి ఇంకా కంప్లీట్ చేయలేదు. దాంతో ‘పటాస్’ సినిమాకు అనుకున్న సెకండ్ హాఫ్‌ను ‘ఆగడు’కి వాడుకుందామని దర్శకుడు శ్రీనువైట్లతో చెబుదామని వెళ్లాను. నేను చెప్పేలోపు వైట్ల గారు సెకండ్ హాఫ్‌ మీద వర్క్ స్టార్ చేసేశారు. ఆయన తన ఫార్మట్ లో వెళ్దామని చెప్పడంతో సరే అదే చేద్దామని అన్నాను.

ఒకవేళ నేను ఆయనతో డిస్కస్ చేసి ఉంటే ’పటాస్’ సెకండ్ హాఫ్ ’ఆగడు’ అయిండేదేమో. ఆ టైంలో మాకు టైం లేదు. ఫాస్ట్‌గా స్క్రిప్ట్ చేశాం. నాకు పటాస్ మూవీ మొదలు కావడంతో వెళ్లిపోయా. ఇప్పటికీ వైట్ల గారు నాతో అప్పుడప్పుడూ ఏమయ్యా నాతో సెకండ్ ఆఫ్ కూర్చోకుండా వెళ్లిపోయావ్ నీ అంతు చూస్తా అని అంటుంటారు. ఇప్పటికి ఈ చిత్రం విషయంలో బాధగానే ఉంది. నేను వైట్ల గారి కోసం కాస్త టైం కేటాయించి ఉంటే బాగుండేది.. ఆగడు మంచి హిట్ అయ్యేది అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -