Thursday, April 25, 2024
- Advertisement -

గ్యాంగ్ లీడర్ కోసం ఏకంగా మూడు కోట్లు ఇచ్చారట

- Advertisement -

కోలీవుడ్లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ చిన్న వయసులోనే బోలెడు సూపర్ హిట్ సినిమాలకి సంగీతాన్ని అందించాడు. తెలుగులో మొదటిసారిగా ‘అజ్ఞాతవాసి’ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా అడుగు పెట్టాడు కానీ మొదటి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాడు. తాజాగా నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ సినిమా తో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించిన అనిరుద్ధ ఆ సినిమాలోని సంగీతంతో పర్వాలేదు అనిపించుకున్నాడు. తాజాగా ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో కూడా అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందించాడు. కానీ ఈ సినిమాకి అనిరుధ్ అందించిన సంగీతం ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.

తమిళంలో మాత్రం చార్ట్ బస్టర్ సాంగ్స్ ను అందించిన అనిరుద్ రవిచందర్ తెలుగులో మాత్రం తన ప్రతిభను చాటలేకపోతున్నాడు. ఇప్పటిదాకా సంగీతం అందించిన మూడు సినిమాలు మ్యూజిక్ పరంగా హిట్ అవ్వలేదని చెప్పుకోవాలి. అయినప్పటికీ రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. తాజా సమాచారం ప్రకారం గ్యాంగ్ లీడర్ సినిమా కోసం అనిరుద్ రవిచందర్ ఏకంగా మూడు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అంత రెమ్యునరేషన్ ఇవ్వడం ఎందుకని నిర్మాతలు ముందు వద్దనుకున్నారని కానీ నాని కి ‘జెర్సీ’ సినిమా పాటలు నచ్చడంతో మళ్లీ అనిరుద్ ని రిపీట్ చేయించాడని సమాచారం. అంత రెమ్యూనరేషన్ తీసుకున్నప్పటికీ అనిరుద్ అందించిన సంగీతం మాత్రం అంతంత మాత్రంగానే ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -