Thursday, April 25, 2024
- Advertisement -

పెళ్లికి రెడీ అయిన ఫ్లాప్ హీరోయిన్

- Advertisement -

‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా హిట్ అయినప్పటికీ అందులో నటించిన అనీషా ఆంబ్రోస్ ఆ సినిమా తర్వాత పెద్ద హిట్లు అంటూ ఏమీ లేవు. ‘అలియాస్ జానకి’ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె పవన్ కళ్యాణ్ సరసన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వంటి సినిమాలో నటించే అవకాశం దక్కింది కాని ఆ తర్వాత పాత్ర కాజల్ అగర్వాల్ కు సొంతమైంది. మరోవైపు అనీషా అంబ్రోస్ ‘ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్’ వంటి సినిమాల్లో నటించింది కానీ పెద్దగా మెప్పించలేకపోయింది. తాజాగా ఈమె ‘సెవెన్’ సినిమాలో కనిపించింది.

ఏడుగురు హీరోయిన్లలో ఈమె కూడా ఒక అమ్మాయి గా కనిపించింది. అయితే ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల పరంగా కాకుండా వ్యక్తిగత విషయం వల్ల ఇప్పుడు వార్తల్లో కెక్కింది అనీషా అంబ్రోస్. ఈమె త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను అని సోషల్ మీడియా ద్వారా ఫాన్స్ కు షాక్ ఇచ్చింది. ఎవరిని పెళ్లి చేసుకోబోతుందో అనే విషయంపై మాత్రం ఇంకా సస్పెన్స్ ఉంచింది ఈ భామ. అయితే ఇది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని కూడా కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా అభిమానులు మాత్రం హ్యాపీ మారీడ్ లైఫ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -