Tuesday, March 19, 2024
- Advertisement -

అంజలి కామెంట్స్ తో షాక్ తిన్న ఆ హీరో….?

- Advertisement -

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తో అత్యంత పెద్ద పేరు సంపాదించుకున్న సినీ నటి అంజలి ఆ తరువాత తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లో విఫలం అయింది. వచ్చిన అడపదడపా అవకాశాలు అందిపుచ్చుకునప్పటికీ అది పెద్దగా ఆమె కెరీర్ కి ఉపయోగ పడలేకపోయాయి.

తాజా గా మరలా ఆవిడ తెలుగు సినిమా లోకి లిసా అనే సినిమా తో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఈ సందర్భంగా ఆవిడ మీడియా తో మాట్లాడుతూ సినిమా గురించి ఆవిడ పర్సనల్ లైఫ్ గురించి, కెరీర్ గురించి అనేక విషయాలను ముచ్చటించింది. అన్నిటికంటే ముఖ్యంగా అంజలి తన రిలేషన్ షిప్ గురించి కొన్ని కీలక విషయాలు తెలిపింది.మీడియా లో ఎప్పటికప్పుడు అంజలి జయ్ అనే హీరో తో డేటింగ్ లో ఉంది అనే వార్తలు వచ్చినప్పటికీ అంజలి ఎప్పుడు పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు కానీ జయ్ మాత్రం అందులో నిజం లేదు అని చాలా సార్లు చెప్పాడు. అయితే తాజా గా అంజలి దీని పై స్పందిస్తూ అసలు తాను ఇప్పటి వరకు రిలేషన్ షిప్ లో లేనే లేను అని చాలా స్పష్టంగా తెలిపింది.

“నేను ఎప్పుడూ రిలేషన్ లో లేను. వున్నాను అని ఎప్పుడు చెప్పలేదు. నా కుటుంబ సభ్యులు అటువంటి వార్తలు మీడియా లో చదివి చాలా వర్రీ అవుతుంటారు కానీ నేను వాటి గురించి పెద్దగా పట్టించుకోను. నాకు పనే ముఖ్యం.” అని అంజలి తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -