Saturday, April 20, 2024
- Advertisement -

బాస్కెట్ బాల్ ప్లేయర్ గా మారిన సిత

- Advertisement -

గత కొంతకాలంగా హారర్ సినిమా తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అంజలి ఒక మంచి బ్రేక్ ఇచ్చే ప్రాజెక్టు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కానీ దాదాపుగా ఆమె సినిమాలన్నీ డిజాస్టర్లుగా మారుతున్నాయి. కెరీర్ మొదట్లో ‘జర్నీ’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి హిట్స్ అందుకున్నప్పటికీ, తన కెరీర్ కి బ్రేక్ ఇచ్చే సినిమా అయితే ఇంకా రాలేదు. తాజాగా ఈసారి కొత్త జోనర్ తో సినిమా చేయబోతోంది అంజలి. తాజా సమాచారం ప్రకారం అంజలి ఒక ఫాంటసీ కామెడీ సినిమాలో నటించబోతోంది. ‘సొన్న పురియతు’ ఫేమ్ కృష్ణన జయరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇంకా టైటిల్ ఖరారు కావాల్సిన ఈ చిత్రం ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో నడుస్తుందని సమాచారం. ఈ సినిమాలో అంజలి ఒక బాస్కెట్ బాల్ ప్లేయర్ రుద్ర గా కనిపిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. యోగి బాబు మరి విజయ్ టీవీ ఫేమ్ రామర్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కేవలం 45 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. చెన్నై, ఊటీ మొదలగు హిల్ స్టేషన్స్ లో చిత్ర షూటింగ్ జరగనుంది. ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు త్వరలో విడుదల కానున్నాయి. మరి ఈ సినిమాతోనైనా అంజలి హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -