అవ‌కాశాల పేరిట వ్యభిచారం.. లైవ్‌లో ప‌ట్టించిన‌ న‌టి

676
Another casting couch issue
Another casting couch issue

కాస్టింగ్ కౌచ్ ఈ ప‌దం వింటే చాలు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వర‌కు ఎన్నో క‌థ‌లు బ‌య‌ట‌కు వ‌స్తాయి.మ‌హిళ న‌టుల‌ను అవ‌కాశాల పేరిట లైంగికంగా వాడుకుని వ‌దిలేస్తున్నార‌ని ఎప్ప‌టి నుంచో ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.సినిమాల‌లో అవ‌కాశాలు క‌ల్పించాలంటే ప‌డ‌క సుఖం త‌ప్ప‌ని స‌రిగా మారింద‌ని కొంద‌రు న‌టీమ‌ణులు తెలుతున్నారు.త‌మ జీవితంలో జ‌రిగిన లైంగిక వేధింపులు గురించి కొంద‌రు మ‌హిళ‌లు బ‌హిరంగంగానే వెల్ల‌డిస్తున్నారు.#మీటూ అనే పేరు మీద దీనిపై పెద్ద పోరాట‌మే జ‌రిగింది.అయిన‌ప్ప‌టికి దీని గురించి ఎక్క‌డో ఓ చోట ,ఎదో ఓ సంఘ‌ట‌న వెలుగులోకి వ‌స్తుంది.

తాజాగా ఇటువంటి సంఘ‌ట‌నే మ‌రోక‌టి బ‌య‌టికి వెలుగు చూసింది.మోహన్ అనే క్యాస్టింగ్ డైరెక్టర్ వర్ధమాన తారలకు అవకాశాలను ఎరగా చూపి, వ్యభిచారం చేయిస్తున్నాడని ఓ యువతి ఆయన రాసలీలలను ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. తన రాసలీలలను బయట పెడితే, తనతో తీసుకున్న వీడియోలను బహిర్గతం చేస్తానని ఆయన బెదిరిస్తున్నాడని ఆరోపించింది.అవకాశాల పేరిట అతను చేస్తున్న దందాపై తనవద్ద ఎన్నో ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. తనకున్న ప్రాణభయం దృష్ట్యా, తన పేరును బయటపెట్టలేనని చెప్పిన ఆమె, సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.