`మన్మథుడు` హీరోయిన్ ఇప్పుడెలా ఉందంటే ?

1836
anshu ambani lifestyle and interesting facts about personal life
anshu ambani lifestyle and interesting facts about personal life

కింగ్ నాగార్జున సరసన మన్మథుడు సినిమాలో నటించిన అన్షు.. ఈ సినిమాలో ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో నటించి యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. మన్మథుడు లో మరో హీరోయిన్ సోనాలి బింద్రే ఉన్నప్పటికి అన్షుకే ఎక్కువగా క్రేజ్ వచ్చింది. ఈ సినిమా తర్వాత అన్షు పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోతుందని భావించారు.

అయితే ఈ సినిమా తర్వాత ప్రభాస్ సరసన రాఘవేంద్ర సినిమాలో నటించింది. ఆ రెండు సినిమాలతో పాటు పలు కన్నడ సినిమాల్లో నటించింది. అయితే అన్షు టాలీవుడ్ లో మిస్సవ్వడానికి కారణం ఒక స్టార్ హీరో అని కూడా ప్రచారమైంది. అతడు దాచేయడం వల్లనే కథానాయికగా అవకాశాలొచ్చినా అన్షు కనిపించలేదని ఫ్యాన్స్ భావించారు. అయితే ఇది గాసిప్ అని తెలిసింది. అన్షు ఎక్కడ ఉంది ? ఏం చేస్తుంది అనే విషయంపై తాజాగా క్లూ ఒకటి దొరికింది. అన్షు ఫ్యామిలీ ఫోటో ఒకటి తాజాగా అంతర్జాలంలో వైరల్ గా మారింది. తనకు భర్త.. ఒక కిడ్ ఉన్నారు. అన్షు లండన్ (యూకే)లో ఉంటున్నారు. అక్కడే భర్త కుటుంబంతో సెటిలయ్యారు. బిజినెస్ మేన్ సచిన్ సగ్గార్ ని అన్షు వివాహం చేసుకున్నారు. వీరికి ఆడబిడ్డ జన్మించింది.

అన్షు ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనర్ గా అక్కడ సొంతంగా ఇన్స్పిరేషన్ కౌచర్ అనే డిజైనింగ్ షాప్ ని రన్ చేస్తున్నారట. బాలీవుడ్ సహా సౌత్ స్టార్ల డిజైన్లకు డూప్లికేట్ పీస్ లు వీటిలో లభ్యమవుతాయని తెలుస్తోంది. సినిమాలకు బై చెప్పేసి సైలెంట్ గా లండన్ వెళ్లిపోయింది. అక్కడే చదువు కంప్లీట్ చేసి పెళ్లి చేసుకుంది. చేసివి రెండు మూడు సినిమాలు అయినప్పటికి మన్మథుడు సినిమా చూసినప్పుడల్లా ఇలాంటి అమ్మాయి మన ప్రేయసిగా ఉంటే బాగుంటుంది అనిపించేలా అన్షు నటించింది. అందుకే ఇప్పటికే ఈమె గురించి ఏ వార్త వచ్చిన వైరల్ అవుతుంది.

Loading...