Friday, March 29, 2024
- Advertisement -

అసలు బుమ్రా ఎవరు అంటున్న అనుపమ పరమేశ్వరన్

- Advertisement -

‘ప్రేమమ్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన అనుపమ పరమేశ్వరన్ ‘అ ఆ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది. ఆ తరువాత పలు సూపర్ హిట్ హిట్ సినిమాలో కనిపించిన అనుపమ పరమేశ్వరన్ ఈ మధ్యనే ‘హలో గురు ప్రేమకోసమే’ అనే సినిమాలో రామ్ సరసన హీరోయిన్ గా నటించింది కానీ ఆ సినిమాతో మంచి విజయాన్ని సాధించలేకపోయింది. అయితే గత కొంతకాలంగా అనుపమ పరమేశ్వరన్ ప్రముఖ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా తో డేటింగ్ చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వీటిపై రియాక్ట్ అయింది అనుపమ.

మీరు నిజంగానే జస్ప్రీత్ బుమ్రా తో రిలేషన్ షిప్ లో ఉన్నారా అని అడుగగా అసలు బుమ్రా ఎవరు అంటూ అనుపమ పరమేశ్వరన్ అందరికీ షాక్ ఇచ్చింది. బుమ్రా ఎవరో తెలియనే తెలీదు అని, తను ఒక క్రికెటర్ అనే విషయం తప్ప తన గురించి తనకు ఇంకేమీ తెలీదు అంటూ అనుపమ పరమేశ్వరన్ క్లారిటీ ఇచ్చింది. ఇక సినిమాల పరంగా అనుపమ పరమేశ్వరన్ ‘రాక్షసుడు’ అనే సినిమాలో నటిస్తోంది. తమిళ సినిమా ‘రాట్సాసన్’ కి రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు. తమిళంలో అనుపమ పరమేశ్వరన్ చేతిలో బోలెడు మంచి సినిమాలు ఉన్నప్పటికీ తెలుగులో మాత్రం ‘రాక్షసుడు’ సినిమా ఒకటే ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -