Thursday, April 25, 2024
- Advertisement -

అనుష్క కి ఫోటో షాప్ చుక్కులా?

- Advertisement -

‘భాగమతి’ సినిమా బ్లాక్ బస్టర్ అయిన చాలా కాలం తరువాత టాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి ఎట్టకేలకు ‘నిశ్శబ్దం’ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం లో మాధవన్ ముఖ్య పాత్ర పోషిస్తుండగా, హాలీవుడ్ నటుడు మైకెల్ మ్యాడ్సన్, అంజలి, శాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా నిన్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. టైటిల్ లాగానే సినిమా కూడా థ్రిల్లింగ్ గా ఉంటుందని చెప్పచ్చు.

అయితే ఈ పోస్టర్ కి సంబంధించి ఆలస్యం గా ఒక విషయం వెలుగు లో కి వస్తుంది. ఈ పోస్టర్ చేయించడం లో చాలా మంది ఫోటో షాప్ ఎక్స్పర్ట్స్ ఇన్వాల్వ్ అయ్యారట. అనుష్క ని అందం గా చూపించడానికి, బయట కన్నా సన్నగా చూపించడానికి చాలా కష్టపడ్డారు అని తెలుస్తుంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగులో ఈ సినిమా 2020 లో ‘నిశ్శబ్దం’ అనే టైటిల్ తో విడుదల కాబోతుండగా, తమిళం మరియు హిందీ భాషలలో ‘సైలెన్స్’ అనే టైటిల్ తో తెరకెక్కనుంది. మరి ఈ సినిమాతో అనుష్క ఎంతవరకు హిట్ అందుకుంటుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -