Wednesday, April 24, 2024
- Advertisement -

హ‌మ్మ‌య్యా మొత్తానికి ఓ సినిమా ఒప్పుకుంది

- Advertisement -

టాలీవుడ్‌లో లేడి ఓరియెంటెడ్ సినిమాల‌కు కేరాప్ అడ్రాస్ అయిన అనుష్క నుంచి సినిమా వ‌చ్చి సంవ‌త్స‌రంపైనే అయింది.భాగ‌మ‌తి వంటి హిట్ త‌రువాత ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సినిమాను అంగీక‌రించ‌లేదు. ఈలోపు ఆమె పెళ్లికి రెడీ అయింద‌ని ,ఢీల్లీకి చెందిన వ్యాపార‌స్థుడితో పెళ్లి చేసుకోననుంద‌నే వార్తలు వినిపించాయి.అయితే ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకోన‌ని చెప్పిన అనుష్క‌,తాజాగా త‌న కొత్త సినిమాను అంగీక‌రించింది. రచయిత కోన వెంకట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

కోన వెంకట్ – గోపీ మోహన్ రచయితలుగా పనిచేసిన ఈ సినిమాకి, హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించనున్నాడు. నటుడు సుబ్బరాజు ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. కథ ప్రకారం ఎక్కువభాగం చిత్రీకరణ యూఎస్ లో జరగనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో అక్కడ షూటింగు మొదలవుతుందని కోన వెంకట్ చెప్పారు. అనుష్క ప్రధాన పాత్రగా సాగే ఈ సినిమాలో ఆమె జోడీగా మాధవన్ కనిపించనున్నారు.ఇక సినిమాకు స్బంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌నున్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -