Friday, April 19, 2024
- Advertisement -

యువ హీరోతో చేతులు కలపనున్న బ్లాక్బస్టర్ డైరెక్టర్

- Advertisement -

కొందరు దర్శకులకి ఒక సినిమా మామూలుగా హిట్ అయినప్పటికి బోలెడు ఆఫర్లు వచ్చి పడతాయి. కానీ దర్శకుడు అశోక్ పరిస్థితి మాత్రం వేరేలా ఉంది. గతేడాది అనుష్క హీరోయిన్ గా నటించిన ‘భాగమతి’ సినిమా తో మర్చిపోలేని బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు అశోక్. ‘అరుంధతి’ తర్వాత మళ్లీ సోలో హీరోయిన్ గా అనుష్క కి బ్లాక్బస్టర్ ఇచ్చిన సినిమా అది. 50 కోట్లకు పైగానే వసూళ్లను సాధించింది. కానీ దర్శకుడు అశోక్ కి మాత్రం మరొక సినిమా లేకుండా పోయింది. అశోక్ వద్ద ఇప్పటికే చాలానే ప్రాజెక్టులు ఉన్నాయట. కానీ వాటిని వినే నాథుడే లేడని తెలుస్తోంది.

దానికి ఉన్న పలు కారణాలలో ఒకటి ‘భాగమతి’ క్రెడిట్ లో సగం అనుష్క కి దక్కడం. మిగతాది సంగీత దర్శకుడు తమన్ మరియు ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ కి దక్కింది. వీరు ముగ్గురికి మంచి పేరే వచ్చింది కానీ ఈ సినిమాకి దర్శకత్వం వహించిన అశోక్ గురించి ఎవరు మాట్లాడడం లేదు. లేడీ ఓరియంటెడ్ సినిమా కాబట్టి అందరి దృష్టి అనుష్క పైనే పడింది. అయితే ఈసారి దర్శకుడు అశోక్ ఒక యువ హీరోతో సినిమా చేయడానికి ప్రయత్నించారట. అతను సినిమా చేద్దాం అంటున్నాడు కానీ డేట్ల విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదట. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -