Friday, March 29, 2024
- Advertisement -

ప్రభాస్ కోసం ఏం చేయడానికైనా రెడీ : అనుష్క

- Advertisement -

అనుష్క శెట్టి.. గొప్ప నటిగా పేరు సంపాధించుకుంది. అన్ని రకల పాత్రలు చేసింది. సూపర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన స్వీటీ తక్కువ కాలంలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. తర్వాత తెలుగు, తమిళ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. దాదాపుగా తెలుగు – తమిళ బాషలలో స్టార్ హీరోలందరి సరసన నటించింది.

టాలీవుడ్ లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్స్ అయిన అరుంధతి – బాహుబలి లాంటి గొప్ప సినిమాలతో తన పేరు దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. బాహుబలి తర్వాత చాలా విరామం తీసుకొని ‘నిశ్శబ్దం’ అనే పాన్ ఇండియన్ మూవీతో మళ్ళీ తెరమీద సందడి చేయనుంది. అయితే నిశ్శబ్దం సినిమాకి అనుష్క ఫిల్మ్ కెరీర్ 15యేళ్ళ మైలురాయినీ చేరుకుంది. ఈ 15ఏళ్లలో తను ఎదుర్కొన్న ఒడిదుడుకులను – తారసపడిన పరిస్థితులను – మిత్రులను – అభిమాన దర్శకులను తలచుకొని ఇటీవలే ఒక టీవీ షోలో కంటతడి పెట్టుకుంది.

ప్రధానంగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన పూరీ జగన్నాథ్ గురించి మాట్లాడి.. తర్వాత తనకు తిరుగులేని నటిగా నిలబెట్టిన – స్టార్ డం అందించిన అరుంధతి సినిమా దర్శకుడు కోడి రామకృష్ణ గురించి గొప్పగా మాట్లాడుతూ కన్నీరు మున్నీరుగా విలపించింది. నేను ఈ స్థాయికి చేరడానికి కారణమైన గ్రేట్ కోడి రామకృష్ణ గారు మరణాన్ని తలచుకొని బాగా ఎమోషనల్ అయిపోయింది. తను ఏడవటమే కాక షోలో ఉన్నవాళ్లను – షో చూసినవాళ్లను కూడా ఏడిపించేసింది.

ఏదేమైనా స్వీటీకి స్వీట్ మనసుతో పాటు గొప్ప ప్రవర్తన కూడా కలిగి ఉందని అందరూ మెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్ అంటే ప్రభాసే అని.. తన స్నేహం కోసం దేన్నీ వదులుకోవడానికైనా రెడీ అని.. ప్రభాస్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంది. ఇలాంటి గొప్ప స్నేహితురాలు మాకు కూడా ఉంటే బాగుంటుందని సోషల్ మీడియా వేదిక అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -