నిశ్శబ్దం గా సాగుతున్న నిశ్శబ్దం ప్రమోషన్స్

167
Anushka Shetty Nishabdam Silence Promotions
Anushka Shetty Nishabdam Silence Promotions

‘భాగమతి’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనుష్క శెట్టి సంవత్సర కాలం సినిమాలకు దూరంగా ఉండి ఇన్నాళ్లకు మళ్ళీ ఒక థ్రిల్లర్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆర్ మాధవన్ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. హాలీవుడ్ ప్రముఖ నటుడు మైకేల్ మ్యాడ్సన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఇటీవలే విడుదల చేశారు దర్శక నిర్మాతలు. అనుష్క లుక్ ని ఈ సినిమా లో ఎలా ఉంటుందో ప్రేక్షకులకి రుచి చూపించారు.

ఇక ఈ సినిమాలో అనుష్క పాత్ర మిగతా సినిమాలతో పోలిస్తే చాలా విభిన్నంగా ఉంటుందని అర్ధమవుతోంది. ఈ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చినా కానీ దానిని మేకర్స్ ఎందుకో సరిగా ప్రమోట్ చేయలేదు. ఈ విషయమై అనుష్క అభిమానులు కొంత అసంతృప్తి గా ఉన్నట్టు తెలుస్తుంది. నిశ్శబ్దం అనే టైటిల్ పెట్టి ఇలా నిశ్శబ్దం గా ఉంటె ఎలా అని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా వారు ప్రమోషన్స్ మొదలు పెడితే బాగుంటుంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, గోపి సుందర్ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. 2020లో ఈ సినిమా తమిళ్ మరియు హిందీ భాషలలో విడుదలకు సిద్ధమవుతోంది. చాలా కాలం తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Loading...