Thursday, April 25, 2024
- Advertisement -

‘సై రా’ సినిమాలో అనుష్క పాత్ర ఇదే

- Advertisement -

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించిన పీరియడ్ బయోపిక్ ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ స్వయంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో స్టార్ కాస్ట్ అమితాబచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, తమన్నా, సుదీప్ కిచ్చా, అనుష్క తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో అనుష్క పాత్ర గురించిన ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో అనుష్క ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది.

ఇప్పటికే రుద్రమదేవి పాత్రలో జీవించిన టాలీవుడ్ స్వీటీ అనుష్క ‘సై రా’ సినిమాలో ఝాన్సీ లక్ష్మీబాయి అవతారం ఎత్తనుంది. బ్రిటిష్ వర్గాల పై దాడికి వెళ్ళబోతున్న ఆర్మీ ని అనుష్క మోటివేట్ చేస్తుందట. ఈ నేపథ్యంలోనే ఆమె బ్రిటిష్ పై దండెత్తిన మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి చెబుతుందట. అనుష్క తన పాత్రలో చాలా బాగా నటించిందని, ఆ పాత్రని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది అని సమాచారం. భారీ అంచనాల మధ్య ఈ సినిమా అక్టోబర్ 2 న విడుదలకు సిద్ధమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -