Tuesday, April 23, 2024
- Advertisement -

ప్ర‌భాస్‌కు ఎవ‌రు ఊహించ‌ని గిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్ అనుష్క‌

- Advertisement -

నిన్న‌(మంగ‌ళ‌వారం) డార్లీంగ్ ప్ర‌భాస్ పుట్టిన రోజు.ఆయ‌న అభిమానులు ప్ర‌భాస్ పుట్టిన రోజుని ఘ‌నంగా జ‌రుపుకున్నారు.ప్ర‌భాస్ ఫ్యాన్స్ సోష‌ల్ బ‌ర్త్ డే హ్యాష్ ట్యాగ్‌ల‌తో రెచ్చిపోయారు.ప్ర‌భాస్ కూడా వారికి స‌ర్‌ప్రైజ్ గిప్ట్ ఇచ్చాడు.ప్ర‌భాస్ ప్ర‌స్తుతం న‌టిస్తున్న సాహో సినిమా మేకింగ్‌ వీడియోతో పాటు ,సినిమాలో ప్ర‌భాస్ పోస్ట్‌ర్‌ని విడుద‌ల చేసి అభిమానుల‌కు ఆనందాన్ని పంచాడు.ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా ప్ర‌భాస్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు.అయితే అంద‌రికంటే భిన్నంగా ప్ర‌భాస్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపింది హీరోయిన్ అనుష్క‌.

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం సాహో సినిమా షూటింగ్‌లో భాగంగా దుబాయ్‌లో ఉన్నాడు.అనుష్క దుబాయ్ వెళ్లి మ‌రి ప్ర‌భాస్ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపాడంతోపాటు స‌ర్‌ప్రైజ్ గిప్ట్ కూడా ఇచ్చింద‌ని స‌మాచారం.ప్ర‌భాస్ ,అనుష్క‌ల మ‌ధ్య ఎఫైర్ ఉంద‌ని ,వీరిద్ద‌రు పెళ్లి చేసుకోబోతున్నార‌ని అప్ప‌ట్లో చాలానే వార్త‌లు వ‌చ్చాయి. మేం జ‌స్ట్ ఫ్రెండ్స్ ,మా మ‌ధ్య‌లో ఎటువంటి ప్రేమ లేద‌ని ఇద్ద‌రు తెలిప‌డం జరిగింది.ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నాడు.అనుష్క‌ మాత్రం సినిమాలు లేక ఖాళీగా ఉంటుంది.ఇంత‌కి ప్ర‌భాస్‌కు అనుష్క ఏం గిఫ్ట్ ఇచ్చిందో తెలియాల్సి ఉంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -