Thursday, March 28, 2024
- Advertisement -

అంజలికి ఆమె చెల్లితో గొడవ ఎందుకు..?

- Advertisement -

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అదరగొట్టిన అంజలి.. ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. ఈ సారి ఆమె త్న చెల్లెలు అని చెప్పబడుతున్న ఆరాధ్య ద్వారా వార్తల్లోకి వచ్చారు. గత వారం ఆరాధ్య అనే అమ్మాయి.. తాను అంజలి చెల్లలు అని.. అక్క అంజలి స్పూర్తితో సినిమాల్లోకి వస్తున్నానని.. తన ఫోటోలను పోస్టు చేస్తూ తెలిపింది.

ఇప్పటికే తను సముద్ర డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్ననని.. మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయని ట్విట్లు చేసింది. ఇందుకు తగ్గట్లుగా ఆరాధ్య పీఆర్వో అయితే అంజలి చెల్లెలు సినిమాల్లోకి వస్తున్నమాట నిజం అంటూ ఓ ప్రెస్ నోట్ పంపారు. ఈ న్యూస్ చూసిన అంజలి వెంతనే స్పందిస్తూ.. తనకు ఎవరూ చెల్లెళ్లు లేరని స్పష్టం చేసింది. తనకు ఉన్న ఒక్కగానొక్క అక్కకు పెళ్లయిపోయిందనీ, ఆమె చాలా సంతోషంగా వున్నదని తెలిపింది.

మరి ఈ ఆరాధ్య ఎవరూ అని అంటే… అంజలి పిన్ని కుమార్తె అని తెలిసింది. గతంలో అంజలికి తన పిన్నితో విభేధాలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ గొడవతో వాళ్లు మీడియా ముందుకు కూడా వచ్చారు. దాంతో అంజలి తన పిన్ని నుంచి దూరంగా వెళ్లిపోయింది. ఇప్పుడు ఆరాధ్య అనే అమ్మాయి అంజలి పిన్ని కుమార్తె అని తెలిసింది. పిన్ని తో గొడవ కావడం వల్ల అంజలి.. ఆరాధ్య ను తన చెల్లి కాదని.. తెలిపినట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -