ఆ దర్శకుడి తో ఎన్టీఆర్ పని చెయ్యట్లేదు

756
Aravinda Sametha Director Trivikram Srinivas is not working with Jr. NTR
Aravinda Sametha Director Trivikram Srinivas is not working with Jr. NTR

జూనియర్ ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి మొట్ట మొదటి సరిగా పని చేసిన చిత్రం అరవింద సమేత వీర రాఘవ. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మన అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా విజయం తర్వాత ఎన్టీఆర్ మార్కెట్ పెరిగింది. ఈ సినిమా తో త్రివిక్రమ్ కూడా తిరిగి విజయ పథం లో కి వచ్చారు. అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే ఈ సినిమా తర్వాత వెంటనే మళ్ళీ ఈ హీరో మరియు దర్శకుడు కలిసి పని చేయాలని భావించారు కానీ కొన్ని అనుకోని కారణాల వలన అది జరగలేదు అని తెలుస్తుంది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న కథనాల ప్రకారం, వీరు మళ్ళీ పని చేస్తున్నారట. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా ని నిర్మించాలని అనుకుంటుంటే ఎన్టీఆర్ తన అన్న కళ్యాణ్ రామ్ ని కూడా నిర్మాణం లో భాగం చేయాలని అనుకుంటున్నాడు అనే టాక్ నడుస్తుంది.

అయితే ఇదంతా నిజం కాదని, అసలు ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేయట్లేదని సమాచారం. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి కలం సెలవల్లో విడుదల అవుతుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ పని చేస్తాడని, అది పూర్తి అవ్వడానికి మరో సంవత్సరం పడుతుంది అని, అసలు ఎన్టీఆర్ దృష్టి లో నే త్రివిక్రమ్ తో సినిమా లేదని అతని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఇదే నిజమైతే వీరు కలిసి పని చేస్తారు అని ఆశించిన అభిమానులకి నిరాశే మిగులుతుంది.

Loading...