హాట్ హాట్ అందాల‌తో రెచ్చిపోయిన షాలినీ పాండే

793
Arjun Reddy Actress Shalini Pandey Latest Photos
Arjun Reddy Actress Shalini Pandey Latest Photos

షాలినీ పాండే… అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో టాలీవుడ్ విజ‌య్ స‌న్సేష‌న్‌స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే. 2017లో వ‌చ్చిన ఈ సినిమా ఘ‌న విజ‌యం సాధించింది. ఇక అర్జున్ రెడ్డి సినిమాలో షాలినీ పాండే రెచ్చిపోయింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి ఘాటు రొమాన్స్ చేసింది షాలినీపాండే. లిప్ లాక్ గురించి అయితే చెప్పేప‌నిలేదు.

అయితే ఈ సినిమా స‌క్సెస్‌లో షాలినీ పాత్ర పెద్ద‌గా హైలెట్ కాలేదు. దీంతో ఈ భామ‌కు పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. తాజాగా క‌ల్యాణ్ రామ్ హీరోగా న‌టించిన 118 సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమా కూడా మంచి విజ‌యాన్ని నమోదు చేసింది. కేవీ గుహన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన మంచి క‌లెక్ష‌న్లను సాధించింది. ఈ సినిమా సక్సెస్ మీట్ రీసెంట్ గా జరిగింది.

సినిమా విజయవంతం కావడంతో ఫుల్ జోష్ లో ఉన్న షాలిని పాండే కాస్త హాటు అవతారంలో దర్శనమిచ్చింది. బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ గౌన్‌ను వేసుకుని స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచింది. ఈ ఈవెంట్‌కు వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రు చూపు షాలిని మీదే ఉంది. త‌న అందంతో చూపుతిప్పుకొనికుండా చేసింది షాలిని. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో షాలినికి మ‌రన్ని అవ‌కాశాలు ఇస్తారేమో చూడాలి.