Tuesday, April 23, 2024
- Advertisement -

పండుగ చేసుకున్న అర్జున్‌రెడ్డి హీరోయిన్‌

- Advertisement -

ప‌ల్లెకు కాంతి తెచ్చే పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు ఇంటిల్లిపాది ఆనందించే తెలుగువారి పండుగ ఇది. ఈ పండుగ‌ను ద‌క్షిణాది రాష్ట్రాల వారు కూడా చేసుకుంటారు. అయితే అక్క‌డ వేరే పేర్లు ఉన్నాయి. ఏ పండుగైతే ఏమిటి ద‌క్షిణాది వారు ఒకేసారి చేసుకోవ‌డం ఆన‌వాయితీ. అయితే సంక్రాంతి పండుగ‌ను 100% ల‌వ్ సినిమా బృందం త‌మిళ‌నాడులో చేసుకుంది. సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో పండుగ‌ను జ‌రుపుకుని సంద‌డి చేశారు. తెలుగులో మంచి హిట్ట‌యిన 100% ల‌వ్ సినిమాను త‌మిళ్‌లో రీమేక్‌గా తీస్తున్నారు.

జీవీ ప్ర‌కాశ్ కుమార్‌తో తీస్తున్నఈ సినిమా షూటింగ్ ఇటీవ‌ల ప్రారంభ‌మైంది. అయితే సంక్రాంతి పండుగ కావ‌డంతో చిత్ర‌బృంద‌మంతా సంప్ర‌దాయ రీతిలో త‌యారై పండుగ‌ను చేసుకున్నారు. పాలు పొంగించి.. భోగి మంట‌లు వేసుకొని.. చెరుకు గ‌డ‌లు తింటూ క‌నిపించారు. ఈ పండుగ‌లో అర్జున్‌రెడ్డి హీరోయిన్ శాలిని పాండే లంగావోణిలో అందంగా క‌నిపించింది. ఈ సినిమాలో ఈ అమ్మ‌డు న‌టిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -