Saturday, April 20, 2024
- Advertisement -

హాలీవుడ్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన తెలుగు క‌మెడియ‌న్‌

- Advertisement -

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచియం అయ్యాడు రాహుల్ రామకృష్ణ. ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ చేసిన న‌ట‌న‌కు మంచి పేరు వ‌చ్చింది. దీంతో అతనికి తెలుగులో వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన గీతా గోవిందం సినిమాలో కూడా అద్భుత‌మైన న‌ట‌న క‌న‌బ‌రిచాడు రాహుల్ రామకృష్ణ .దీంతో స్టార్ హీరోల సినిమాల‌లో సైతం అత‌నికి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. మ‌హేశ్ బాబు న‌టించిన భ‌ర‌త్ నేను సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించి మెప్పించాడు. తాజాగా రాహుల్ రామకృష్ణకు బాలీవుడ్‌లో అవకాశం వచ్చింది. ఈ విష‌యాన్ని అత‌నే త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు.

ప్రదీప్ కాటసాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సిల్క్ రోడ్ అనే టీవీ సిరీస్ లో తాను ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. నా ప్రాజెక్ట్ కు సంబంధించి చిన్న స్నీక్ పీక్ ఇది… కష్టపడినందుకు మంచి ఫలితాలు రావాలని కోరుకుంటున్నా అని ట్వీట్ లో తెలిపారు. ఇక రాహుల్ రామకృష్ణ ఇటీవ‌ల న‌టించిన హుషారు సినిమాలో ఓ పాట‌ను కూడా పాడాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని న‌మోదు చేసింది. తాజాగా రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా న‌టించిన మిఠాయి ఫిబ్రవరి 22 న విడుదలకు రెడీ అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -