పవన్ కళ్యాణ్ కోసం కథ రాయబోతున్న ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు

230
Arjun Reddy Director Sandeep Vanga Story for Pawan Kalyan
Arjun Reddy Director Sandeep Vanga Story for Pawan Kalyan

గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయాల మీద మాత్రమే దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ ని తిరిగి మళ్ళీ సినిమాల్లోకి రప్పించేందుకు టాలీవుడ్లోని బడా నిర్మాతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ వారు పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పలు దర్శన్ స్టార్ దర్శకులకు అడ్వాన్సులు ఇచ్చి పవన్ కళ్యాణ్ కోసం కథ రాసి ఆ కథతో పవన్ కళ్యాణ్ ను మెప్పించమని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ కోసం ఒక కథని ప్రిపేర్ చేసే పనిలో పడ్డాడు.

తాజాగా ఇప్పుడు ఈ జాబితాలో చేరాడు సందీప్ వంగ. తెలుగులో ‘అర్జున్ రెడ్డి’, హిందీలో ‘కబీర్ సింగ్’ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న సందీప్ వంగ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం ఒక సినిమా కథ రాయబోతున్నారట. మైత్రి మూవీ మేకర్స్ వారు సందీప్ కు భారీ మొత్తాన్ని అడ్వాన్స్ గా ఇచ్చినట్లు సమాచారం. కథ రాయడం పూర్తయ్యాక మైత్రి మూవీ మేకర్స్ వారు స్వయంగా సందీప్ మరియు పవన్ కళ్యాణ్ మధ్య ఏర్పాటు చేయనున్నారు. మరి మైత్రి మూవీ మేకర్స్ కోరుకున్నట్లు పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి వస్తారా లోకి తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.

Loading...