Saturday, April 20, 2024
- Advertisement -

దర్శకుడికి నిఖిల్ కి చెడింది నిజమేనా?

- Advertisement -

యువ కథానాయకుడు నిఖిల్ ప్రధాన పాత్ర లో అర్జున్ సురవరం అనే సినిమా షూటింగ్ ముగించుకుంది. ఏ ముహూర్తం లో సినిమా ని మొదలు పెట్టారో కానీ పాపం సినిమా యూనిట్ కి అడుగడుగునా అనేక ఇబ్బందులు ఎదురు అయ్యాయి. టైటిల్ తో మొదలు పెడితే విడుదల తేదీ వరకు ఒక్కటి కూడా చిత్ర యూనిట్ అనుకున్న విధంగా జరగడం లేదు. కథ ప్రకారం బాగుంటుంది అని సినిమా కి ముందుగా ముద్ర అనే టైటిల్ ని పెట్టారు దర్శక నిర్మాతలు. ఆ తర్వాత ఆ టైటిల్ తమదని వేరే సినిమా వాళ్ళు కేసు పెట్టడం తో చిత్ర యూనిట్ వెనక్కి తగ్గి సినిమా కి అర్జున్ సురవరం అనే కొత్త టైటిల్ ని పెట్టారు.

ఇక అన్నీ బాగుండి ఉంటె ఈ పాటికి ఈ సినిమా ఎప్పుడో విడుదల అయ్యేది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వలన ఈ సినిమా దాదాపుగా రెండు సార్లు వాయిదా పడింది. గతం లో సినిమా వాయిదా పడటానికి కారణాలు చాలా నే ఉన్నాయి కానీ ఇప్పుడు తాజా గా ఈ సినిమా వాయిదా పడటానికి కారణం కొత్తది వినిపిస్తుంది. అయితే ఇండస్ట్రీ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం ఈ సినిమా హీరో నిఖిల్ కి దర్శకుడు కి కొన్ని క్రియేటివ్ విభేదాలు రావడం తో పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశ లో సినిమా ఆగిపోయిందని తెలుస్తుంది.

ఈ సినిమా కి ఎప్పుడు మోక్షం కలుగుతుందో, నిఖిల్ తన కొత్త చిత్రం ఎప్పుడు మొదలు పెడతాడో అని అందరూ ఎదురు చూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -