Saturday, April 20, 2024
- Advertisement -

స్టార్ హీరోకు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన హైకోర్టు

- Advertisement -

క‌న్న‌డ స్టార్ హీరో సుదీప్‌ను అరెస్ట్ చేయ‌ల‌ని అరెస్ట్ వారెంట్ జారీ చేసింది అక్క‌డ హైకోర్టు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే… కాఫీ ఎస్టేట్ వివాదంపై గ‌త కొంత కాలంగా హైకోర్టులో విచార‌ణ సాగుతోంది. అయితే ఈ కేసు విచార‌ణ‌కు సుదీప్ కోర్టుకు హాజ‌రుకాక‌పోవ‌డంతో ఆగ్ర‌హించిన హైకోర్టు సుదీప్‌ను త‌క్ష‌ణ‌మే అరెస్ట్ చేయ‌ల‌ని పోలీసుల‌ని ఆదేశించింది. చిక్ మంగళూరు న్యాయస్థానం సుదీప్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వ‌చ్చే మే నెల‌లోపు సుదీప్ ఎక్క‌డ ఉన్నాడో అచూకి తెలుసుకుని కోర్టు ముందు హాజరు పరచాల్సిందిగా కర్ణాటక పోలీసులను ఆదేశించింది. 2016లోఓ టీవీ షో షూటింగ్ కోసం దీపక్ పటేల్ అనే వ్యక్తికి చెందిన కాఫీ ఎస్టేట్‌ను సుదీప్ అద్దెకు తీసుకున్నారు. దీని కోసం రూ.80 లక్షలు చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారట‌.

దీనిలో భాగంగా అడ్వాన్స్‌గా యాభై వేలు ఇచ్చి మిగిలిన అమౌంట్‌ను తరువాత ఇచ్చే కింద ఒప్పందం చేసుకున్నార‌ట‌. అయితే మిగిలిన డ‌బ్బు ఇప్ప‌టి వ‌ర‌కు చెల్లించ‌క‌పోవ‌డంతో సుదీప్, సుదీప్ కి చెందిన ప్రొడక్షన్ హౌస్, డైరెక్టర్ మహేష్ లపై కేసు నమోదు చేశారు.అయితే ఈ కేసులో సుదీప్ తప్పించుకు తిరుగుతున్నాడని ఆరోపణలు చేస్తున్నారు. మ‌రి ఇప్ప‌టికి అయిన సుదీప్ ఈ కేసు గురించి స్పందిస్తారేమో చూడాలి. సుదీప్‌కు క‌న్న‌డ‌లోనే కాకుండా తెలుగులో కూడా మంచి ఇమేజ్ ఉంది. ఈగ‌,బాహుబ‌లి సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైయ్యాడు సుదీప్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -