Friday, April 19, 2024
- Advertisement -

“అశ్వథ్థామ” మూవీ రివ్యూ

- Advertisement -

హీరో నాగశౌర్య ఈసారి హిట్ కొట్టాలని కసి మీదా ఉన్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం అశ్వథ్థామ. ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్ గా నటించగా రమణ తేజ దర్శకత్వం వహించారు. మరి ఈ రోజే రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :

కథలోకి వెళ్తే.. కొన్ని ఊహించని కారణాలతో కొంతమంది అమ్మాయిలు మిస్సవుతూ హత్యలు చేయబడుతారు. ఇదే క్రమంలో గణ(నాగశౌర్య) ఈ దారుణ ఘటనల గురించి తెలుసుకుంటాడు. వీటి వల్ల గణకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి ? అసలు ఈ దారుణాల వెనుక కారణం ఎవరు ? వీటికి పరిష్కరం కోసం హీరో ఏం చేశాడు ? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఇన్ని రోజులు లవర్ బాయ్ గా కనిపించిన నాగ శౌర్య ఈ సినిమాలో మాస్ యాంగిల్ కనిపించి అద్భుతంగా నటించాడు. అలాగే శౌర్య చెల్లెలు పాత్రలో కనిపించిన నటి మంచి నటన కనబర్చింది. మెహ్రీన్ తన పాత్రకు న్యాయం చేసింది. ఈ సినిమాలో ప్రధాన బలం కథ అని చెప్పాలి. కథ అనుసంధానంగా వచ్చే ఎమోషన్స్.. ట్విస్టులు చాలా బాగున్నాయి. ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ తో పోలిస్తే సెకండాఫ్ చాలా బాగుంది. సెకండాఫ్ లో అసలు కథ మొదలు అవుతుంది. మెయిన్ విలన్ ఎంట్రీతో పాటుగా సినిమా మెయిన్ థీమ్ లోకి ఇక్కడ నుంచే వెళ్తుంది. కథానుసారం వచ్చే ఎమోషన్స్ కానీ క్రైమ్ థ్రిల్లింగ్ సీన్స్ కానీ ఆకట్టుకుంటాయి. ఆడవాళ్లపై చూపే సన్నివేశాలతో ప్రేక్షకులు భావోద్వేగానికి లోనవుతారు. అలానే యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి. దీనికి “కేజీయఫ్” చిత్రానికి యాక్షన్ పార్ట్ ను అందించిన అన్బు – అరివు ల యాక్షన్ కొరియోగ్రఫీ మంచి ప్లస్ అయ్యింది. ముఖ్యంగా విలన్ రోల్ లో కనిపించిన వ్యక్తి అయితే ఆ విలనిజంలో క్రూరత్వాన్ని మొహం చూపించకుండానే చూస్పిస్తాడు. అతనిపై వచ్చే సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులకు మంచి థ్రిల్ ను ఇస్తాయని చెప్పాలి.చ్ఇక దర్శకుడు రామ తేజ విషయానికి వస్తే మంచి కథను ఇచ్చిన నాగశౌర్యకు తన వంతుగా న్యాయం చేశాడు. అలాగే శ్రీ చరణ్ పాకల అందించిన పాటలు ఒకే అనిపిస్తాయి. అయితే సినిమాకు మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ స్పెషలిస్ట్ జిబ్రాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరింత బూస్టప్ ఇచ్చింది అని చెప్పాలి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ : సెకండాఫ్ తో పోలిస్తే ఫస్ట్ ఆఫ్ చాలా స్లోగా ఉంటుంది. కామెడీ ఎక్కువగా ఉండదు. కథ బాగున్నప్పటికి కథనం చాలా నెమ్మదిగా సాగుతోంది. అది మైనస్ పాయింట్.

మొత్తంగా : అశ్వథ్థామ కథ పరంగా.. హీరో, హీరోయిన్లు మిగిత నటినట్లు అన్ని బాగున్నప్పటికి.. కథనం మాత్రం చాలా స్లోగా ఉంటుంది. అసలు సోల్ మీస్ అయితుందేమో అనిపిస్తోంది. ఏది ఏమైన ఎమోషనల్, యాక్షన్ , క్రైమ్ మరియు సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -