Thursday, April 25, 2024
- Advertisement -

ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ఎవెంజ‌ర్స్‌’

- Advertisement -

హాలీవుడ్ సినిమాల‌కు ఇండియాలో మంచి మార్కెట్ ఉంది. కొద్దిగా ఆక‌ట్టుకున్న చాలు ఆ త‌రువాత వ‌చ్చే సీక్వెల్స్‌ను వ‌దిలిపెట్ట‌రు. మరి అలాంటిది గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా మార్వెల్‌ సిరీస్ నుంచి వ‌స్తున్న సినిమాల‌ను ఎలా ఆద‌రిస్తారో ప్ర‌త్యేకంగా చెప్పాలా?. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ నిన్ననే(శుక్ర‌వారం) ఇండియాలో విడుద‌ల అయింది. భారీ అంచనాల మ‌ధ్య విడుద‌ల అయిన ఈ సినిమా అంద‌రిని ఆక‌ట్టుకుంది.

ఇండియాలో బుక్‌మైషో ద్వారాలోనే తొలి రోజున 40 కోట్లపైగా వ‌సూళ్లు రాబ‌ట్టింద‌ని తెలుస్తోంది. ఇక చైనాలో కూడా ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేశారు. తొలిరోజు అక్కడ సాధించిన వసూళ్లు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. దాదాపు రూ.750 కోట్లు వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఇప్ప‌టిక‌వ‌రకు విడుద‌ల అయిన హాలీవుడ్ మూవీస్ కూడా ఈ రేంజ్‌లో క‌లెక్ష‌న్లు సాధించ‌లేక‌పోయింది. ఇక ఇండియాలో కూడా ఈ సినిమా మంచి క‌లెక్ష‌న్లు సాధించింద‌ని తెలుస్తోంది. సినిమా రెండో రోజే 100 కోట్ల క్ల‌బ్‌లో చేర‌డం ఖాయం అని అంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు. మొదటిరోజే ఈ రేంజ్‌లో వసూలు చేసిందంటే లాంగ్ రన్ ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

ఇండియాలో ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ 500 కోట్లు సాధిస్తుంద‌ని అంచనా వేస్తున్నారు. సినిమాలో మొత్తం అద్భుతం అని అంటున్నారు ప్రేక్ష‌కులు. చివ‌రి అరగంట సినిమాకే హైలేట్ అని చెబుతున్నారు. చివ‌ర్లో వ‌చ్చే సీన్స్ కంట‌త‌డి పెట్టించ‌డం ఖాయం అని అంటున్నారు అభిమానులు. ఎవెంజ‌ర్స్ సిరీస్ ఈ సినిమాతో ఆగిపోనుంది. త‌రువాత నుంచి ఎవెంజ‌ర్స్‌ను ప్రేక్ష‌కులు చూడ‌లేరు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -