బాబా మాస్క్ దెబ్బ… శ్రీముఖి అబ్బ

1349
Baba Bhaskhar Master Strong Counter to Sri Mukhiothi, BiggBoss 3 Telugu, Vithika, Varun Sandesh, Rahul Sipligunj, Ravi Kiran, Nagarjuna Akkineni
Baba Bhaskhar Master Strong Counter to Sri Mukhi

నామినేషన్ ప్రక్రియ వస్తే చాలు ఇల్లంతా గడగడలాడిపోతుంది. ఎవరిని నామినేట్ చెయ్యాలి అనేది ఒక వైపు అయితే, నామినేట్ చేసిన వారి బిహేవియర్ ఎలా మారిపోతుందో అనేది మరో వైపు. కొంతమంది అయితే గ్రూపులు గ్రూపులుగా ఏర్పడి సేఫ్ గేమ్ ఆడుతూ నెట్టుకొస్తున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్లో రెండు గ్రూపులు ఉన్నాయి. వితిక, పునర్నవి, రాహుల్, వరుణ్ ఒక గ్రూపు… శ్రీముఖి, బాబా మాస్టర్, రవి, శివ జ్యోతి, మహేష్ మరో గ్రూప్. ఎంత తిట్టుకున్నా ఏం చేసినా విడిపోని వారు వరుణ్ గ్రూపు అయితే, చిన్న గొడవకే నామినేట్ చేసుకునే గ్రూపు శ్రీముఖి గ్రూపు.

అలాంటి అనుకోని సంఘటనలో భాగంగానే నిన్న శ్రీముఖి నామినేట్ అయ్యింది. ఇందులో క్లియర్ గా వరుణ్ సేఫ్ గేమ్ ఆడితే, బాబా మాస్టర్ మాత్రం శ్రీముఖి అదిరిపోయి, బెదిరిపోయి, పారిపోయే సేఫ్ గేమ్ ఆడాడు. వితిక, రవి విషయంలో ఎలానూ వితిక సేఫ్ అని తెలిసాక రవి పేరు చెప్పాడు వరుణ్… బాబా మాస్టర్ మాత్రం శ్రీముఖి, జ్యోతి విషయంలో టై బ్రేక్ చెయ్యాల్సిన టైంలో తనకి క్లోజ్ అయిన శ్రీముఖి పేరు చెప్పకుండా, జ్యోతి పేరు చెప్పాడు. శ్రీముఖి ఈ సంఘటన నుండి తేరుకోవడానికి పెద్ద యుద్ధమే చేసింది తన మనసుతో. మొదటిసారిగా తనకు ఒక్కదాన్ని అయిపోయా అనే ఫీలింగ్ వచ్చిందట.

గేమ్ లో ఎవరి లాజీక్స్ వారివి, ఎవరి మ్యాజిక్స్ వారివి కానీ నమ్మిన శ్రీముఖి బాబా మాస్టర్ మోసం చెయ్యడం ఇది రెండోసారి. టెక్నికల్ గా చూస్తే బాబా మాస్టర్ లోలోపల శ్రీముఖి వెళ్ళిపోవాలి అని భావిస్తున్నట్టు శ్రీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Loading...