Saturday, April 20, 2024
- Advertisement -

ఆ యాప్ లో బాహుబలి నటి ఫోటోలు.. పోలీసులకు ఫిర్యాదు..!

- Advertisement -

సోషల్ మీడియా బాగా పెరిగిపోయినప్పటి నుంచి హీరోలు హీరోయిన్లు కలిసి నటిస్తే చాలు వారి మధ్య ఎఫైర్ ఉందని.. వారు ప్రేమలో ఉన్నారని రూమర్స్ మొదలు అవుతూ ఉంటాయి. ఇక వారు బయట కనిపిస్తే పెళ్లి కూడా చేసేసుకున్నారని రాసేస్తారు. ఇలాంటి బాధలు ఎక్కువగా హీరో, హీరోయిన్స్ కి ఉంటాయి.

అయితే ఈ డేటింగ్ యాప్ లు వచ్చాకా హీరోలు హీరోయిన్ల ఫోటోలనే కాదు.. వర్ధమాన నటీనటులు సినిమాల్లో పద్ధతిగల పాత్రల్లో నటించిన వారిని కూడా వదలకుండా ఏడిపిస్తున్నారు కొందరు ముర్ఖులు. బాహుబలి 2 సినిమాలో అనుష్క వదినగా నటించిన ఆశ్రిత వేముగంటి తెలిసే ఉంటుంది. ఈ సినిమాతో ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. అయితే మంచి సంప్రదాయ కళాకారిణి అయిన ఈమె ఆ సినిమాలో శ్రీకృష్ణుడు పాటలో నృత్యం చేసి అలరించింది. యాత్ర సినిమాలో విజయమ్మగానూ నటించింది.

సంప్రదాయ కళాకారిణి నటి అయిన ఈమెను కూడా డేటింగ్ యాప్ లో ఎక్కించి ఆమెను ఆభాసుపాలు చేశారు కొందరు ప్రబుద్ధులు..చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులను అందులో పెట్టి వికృత చర్యలకు పాల్పడ్డారు. తాజాగా ఈమె సడెన్ గా డేటింగ్ యాప్ లో కనపడింది. దాంతో అందరూ షాక్ అయ్యారు. ఈమె ఫొటోను కొందరు మార్ఫింగ్ చేసి ఇలా డేటింగ్ యాప్ లో పెట్టారు. దాంతో ఈ విషయంపై సీరియస్ అయిన ఆశ్రిత సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -