Wednesday, April 24, 2024
- Advertisement -

బాలయ్యకు ప్రముఖుల పుట్టినరోజు శుభాకాంక్షలు..!

- Advertisement -

నేడు నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు కాగా, జూనియర్ ఎన్టీఆర్, తన ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. “నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే. నాకు ఊహ తెలిశాక చూసిన మొట్టమొదటి హీరో మీరే. ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. బాబాయ్… మీ 60వ పుట్టిన రోజు సందర్భంగా నా శుభాకాంక్షలు. జై బాలయ్య” అని ట్వీట్ చేశారు. బాలకృష్ణకు నేడు పలువురు రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు శుభాభినందనలు తెలియజేస్తూ, ట్వీట్లు పెడుతున్నారు. కాగా, నేటి పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని బాలకృష్ణ నిర్ణయించుకున్నారన్న సంగతి తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, “60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు. ఇదే ఉత్సాహంతో ,ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని,అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను. ప్రియమైన బాలకృష్ణా… నువ్వు అరవైల్లోకి అడుగుపెట్టావు. నీ అద్భుతమైన ప్రయాణాన్ని నేను ఎంతో ప్రేమగా గుర్తుచేసుకుంటున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు.

‘నటన అయినా, ప్రజాసేవ అయినా… చేసే పనిలో నూటికి నూరుపాళ్లు నిబద్ధతతో ఉండే వ్యక్తి బాలకృష్ణ గారు. అందుకే ఆయన కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. బాలకృష్ణగారు అరవై వసంతాలు పూర్తి చేసుకున్న శుభసందర్భంలో ఆయనకు షష్టిపూర్తి మహోత్సవ శుభాకాంక్షలు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు.

‘అందరికీ ఆయన బాలయ్య. నా ఒక్కడికీ ఆయన ముద్దుల మావయ్య. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా తనను నమ్ముకున్న వారికి అండగా నిలిచే కథానాయకుడు ఆయన. బాలా మావయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు, షష్టిపూర్తి మహోత్సవ అభినందనలు’ అని టీడీపీ నేత లోకేశ్ ట్వీట్ చేశారు.

‘నిన్న బాలా మావయ్య కొత్త సినిమా టీజర్ చూశాను. చాలా ఎనర్జిటిక్ గా కనిపించారు. మావయ్యా… మీరు మరెన్నో చిత్రాల్లో నటించి… మీ అభిమానులకు ఎప్పటిలాగే సంచలన విజయాలను కానుకగా ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను’ అని ఆయన చెప్పారు.

‘మా బాలయ్యకి జన్మదిన శుభాకాంక్షలు. మా సొంత నిర్మాణ సంస్థ ఆర్కే ఫిలిమ్స్ అన్నగారి వారసుడుతోనే ప్రారంభించాలనుకున్నాము. మా బాలయ్యతోనే అది మొదలైంది. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ఇంకెన్నో శిఖరాలు అధిరోహించాలని ఆశీర్వదిస్తున్నాను’ అని దర్శకుడు రాఘవేంద్ర రావు ట్వీట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -