Friday, April 26, 2024
- Advertisement -

అభిమాని చెంప పగులగొట్టిన నందమూరి బాలకృష్ణ?!

- Advertisement -

డిక్టేటర్ సినిమా ఆడియో విడుదల వేడుకలో ఒక అభిమానికి చెంప దెబ్బ సంస్కారం చేశాడట నందమూరి బాలకృష్ణ.ఓవరాక్షన్ చేసిన ఒక అభిమానిపై బాలయ్య ఇలా విరుచుకుపడ్డట్టుగా తెలుస్తోంది. తన భుజం మీద చెయ్యి వేయబోయినందుకు గానూ బాలకృష్ణ ఈ విధంగా ఆ అభిమానిని సత్కరించాడనే ప్రచారం జరిగింది.

విషయం ఏమిటంటే.. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ వేషధారణతో హడావుడి చేసిన నందమూరి వంశాభిమాని ఒకరు కార్యక్రమం చివర్లో బాలయ్యతో ఫొటో దిగాలని ప్రయత్నించాడు. అయితే మామూలుగా ఫొటో అయ్యుంటే బాగానే ఉండేదేమో కానీ…

సదరు అభిమాని ఎన్టీఆర్ లెవల్లో బాలయ్య భుజం మీద చెయ్యి వేసి ఫొటో దిగాలని ప్రయత్నించాడు. దీంతో బాలయ్యకు మండింది. అతడి చెంప ఎర్రబడింది. బాలయ్య ఇలా దురుసుగానే ప్రవర్తించినప్పటికీ..తన దగ్గర తేడాలొస్తే..

ఇలాగే ఉంటుందన్న విసయాన్ని ఇది వరకూ బాలయ్య పలుసార్లుగా రుజువు చేసుకొన్నాడు. ఇప్పుడు పబ్లిగ్గారు రుజువైందంతే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -