Tuesday, March 19, 2024
- Advertisement -

బాలకృష్ణ వేసిన మాస్టర్ ప్లాం ఇదే

- Advertisement -

నందమూరి బాలకృష్ణ, కె యస్ రవి కుమార్ ఇద్దరు కలిసి జై సింహ తరువాత రెండో సారి పని చేయబోతున్నారు. ఈ సినిమా కి రూలర్ అనే టైటిల్ కన్సిడరేషన లో ఉన్నట్టు ఫిలిమ్ నగర్ సమాచారం. సి కళ్యాణ్ నిర్మాతగా ఈ సినిమా మే 17 న ప్రారంభం అవుతుంది అని అధికారికంగా ప్రకటించినప్పటికీ ఈ సినిమా లాంచ్ వాయిదా పడింది.

వివరాలలోకి వెళితే బాలకృష్ణ కావాలనే ఈ సినిమా కి సంబందించిన అనౌన్స్మెంట్ మరియు లాంచ్ ప్రోగ్రాం ని వాయిదా వేయించాడు అట. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాతనే ఈ సినిమా కి సంబందించిన ముహూర్తం పెట్టుకుంటేనే బావుంటుంది అని ఒక వేళ ఎన్నికల ఫలితాలు తారుమారు అయినా తన కార్యకర్తలను, అభిమానులను, కేడర్ నీ ఉత్సాహ పరిచేందుకు ఫలితాల తరువాత కొత్త సినిమా అనౌన్స్మెంట్ తో ముందుకు వెళ్లచ్చు అని బాలకృష్ణ భావించాడు అట.

అందుకనే అప్పటికప్పుడు హుటాహుటిన నిర్మాత దర్శకుడితో మాట్లాడి సినిమా లాంచ్ నీ వాయిదా వేయించి ప్రస్తుతం ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాడు బాలకృష్ణ. ఈ సినిమా లో హరి ప్రియ ఒక హీరోయిన్ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. జగపతి బాబు, వరలక్ష్మి శరత కుమార్ కూడా ఈ సినిమా లో ఉన్నారట. చిరంతన్ భట్ ఈ సినిమా కి సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -