నాగబాబు, జూనియర్ ఎన్టీఆర్ గురించి స్పందించిన బాలయ్య..!

767
balakrishna responds on nagababu comments
balakrishna responds on nagababu comments

కరోనా కారణంగా షూటింగ్ లు ఆగిపోవడంతో ఈ విషయంపై టాలీవుడ్ పెద్దలు తెలంగాణ ప్రభుత్వంతో ఇటీవలే సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశాలకు నందమూరి బాలకృష్ణను ఆహ్వానించకపోవడంతో వివాదం రూపుదాల్చింది. ఈ విషయంలో బాలయ్య కొన్ని వ్యాఖ్యలు చేయగా.. దానికి నాగబాబు ప్రతిస్పందించి మరికొన్ని కామెంట్స్ చేశారు.

ఈ విషయమై తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలయ్యను యాంకర్ ప్రశ్నించింది. నాగబాబు వ్యాఖ్యలపై ఏమంటారని అడగ్గా… “ఛీ, ఛీ… నేనేమంటాను, అన్నీ ఆయనే మాట్లాడుతున్నాడు కదా. నేను అస్సలు స్పందించను. ఇవాళ ఇండస్ట్రీ మొత్తం నాకు సపోర్ట్ గా నిలుస్తోంది. అలాంటప్పుడు నేనెందుకు మాట్లాడాలి?” అంటూ బదులిచ్చారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఎప్పటి నుంచో చర్చనీయాంశంగా ఉంది.

దీనిపై బాలయ్య మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రావడం అనేది జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత విషయం అని, అతని ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. అయినా, జూనియర్ ఎన్టీఆర్ కు నటుడిగా ఎంతో భవిష్యత్ ఉందని, ఈ నేపథ్యంలో, వృత్తిని వదులుకుని రాజకీయాల్లోకి రమ్మని చెప్పలేనని బాలయ్య స్పష్టం చేశారు.

Loading...