Friday, April 19, 2024
- Advertisement -

మళ్లీ బాక్సాఫీస్ వద్ద తలపడనున్న సీనియర్ హీరోలు

- Advertisement -

గత కొన్ని సంవత్సరాలలో సీనియర్ హీరోల సినిమాలు క్లాష్ అయ్యాయి అంటే అది 2016లో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘డిక్టేటర్’ సినిమా మరియు నాగార్జున హీరోగా నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా రెండూ సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యాయి. తాజా సమాచారం ప్రకారం 2020 లోని సంక్రాంతికి కూడా అదే పరిస్థితి నెలకొనేలా కనిపిస్తోందని తెలుస్తోంది. ఒకవైపు బాలకృష్ణ ఇప్పటికే తన 105వ సినిమా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ మధ్యనే ఘనంగా లాంచ్ అయ్యింది. ‘రూలర్’ అనే టైటిల్ ను అనుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి సంక్రాంతి కి విడుదల కాబోతుంది.

మరోవైపు నాగార్జున తన బ్లాక్ బస్టర్ సినిమా ‘సోగ్గాడే చిన్నినాయన’ లోని బంగార్రాజు పాత్రపై ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘బంగార్రాజు’ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా త్వరలో ఆగస్టు లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే 2016 లో పోటీ పడ్డ నాగ్, బాలయ్య ఇప్పుడు మళ్ళీ బాక్సాఫీస్ వద్ద తలపడనున్నారు. మరి వీరిద్దరి సినిమాలలో ఏ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందో వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -