Friday, March 29, 2024
- Advertisement -

ఆ అవకాశం నాకు లిటిల్ బాస్ త్వరగా ఇవ్వాలి: బండ్ల గణేష్

- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి అన్నా, మెగా ఫ్యామిలీ హీరోలు అన్నా నిర్మాత బండ్ల గణేష్ కి ఎంతో ప్రీతి అనే విషయం మనం ప్రత్యేకం గా గుర్తు చేసుకోవాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ అంటే గణేష్ కి దేవుడి తో సమానం. చిరంజీవి ని బాస్ అని, రామ్ చరణ్ ని లిటిల్ బాస్ అని అభివర్ణించడం ఆయనకి అలవాటు.

ఏదైనా మెగా హీరోలకి సంబంధించి ఒక సినిమా ఫంక్షన్ జరుగుతూ, అక్కడకి బండ్ల గణేష్ వచ్చారంటే, ఒక్కసారిగా అభిమానుల్లో ఉత్తేజం నిండుతుంది. తన స్పీచ్ తో గణేష్ అలరించే విధం గా మరెవరూ చేయలేరు. ఆయన అటు పవన్ కళ్యాణ్ తో, ఇటు రామ్ చరణ్ తో సినిమాలు నిర్మించి ఎప్పటి నుంచో మెగాస్టార్ తో కూడా సినిమా చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.

రేపు సైరా నరసింహ రెడ్డి సినిమా విడుదల ని పురస్కరించుకొని, గణేష్ ట్విట్టర్ లో మెగాస్టార్ కి అభినందనలు తెలుపుతూ, ఆయన తో పని చేసే అవకాశం లిటిల్ బాస్ అయిన రామ్ చరణ్ త్వరగా ఇవ్వాలని కోరుకున్నారు.

“మీసం తిప్పిన మొనగాడు దమ్మున్న మగధీరుడు కసి తో నాస్తి దుర్భిక్షం అన్న మా అన్న సైరా సై సై రా అంటూ మీ ముందుకు వస్తున్న మా మెగాస్టార్ మా ఆరాధ్య దైవం తెలుగు చలన చిత్ర చరిత్ర రికార్డులన్నీ తిరగరాయాలి. మళ్లీ మీ తో ఓ సినిమా తీసి ఆ సినిమాను బ్లాక్ బస్టర్ సినిమాగా ప్రజల ముందు ఉంచాలని ఆ అవకాశం లిటిల్ బస్ నాకు త్వరగా ఇవ్వాలని కోరుకుంటూ మీ బండ్ల గణేష్”.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -