Friday, April 19, 2024
- Advertisement -

బందోబస్త్ మూవీ రివ్యూ

- Advertisement -

నటీనటులు : సూర్య, మోహన్ లాల్, ఆర్య, సయేశా, బోమన్ ఇరానీ తదితరులు.
దర్శకత్వం : కె వి ఆనంద్
నిర్మాత‌లు : సుభాస్కరన్‌ అల్లిరాజా
సంగీతం : హరీష్ జయ్ రాజ్
సినిమాటోగ్రఫర్ : ఎం ఎస్ ప్రభు
ఎడిట‌ర్‌ : ఆంటోనీ

కథ:
రవి (సూర్య) ప్రధాన మంత్రి (మోహన్ లాల్) దగ్గర పని చేస్తూ ఉంటాడు. అయితే ఒక రోజు తన కాళ్ళ ముందే ప్రధాన మంత్రి టెర్రర్ దాడి లో ప్రాణాలు కోల్పోతాడు. ఆ తర్వాత ప్రధానమంత్రి కుమారుడు (ఆర్య) పదవి చేపడతారు. అసలు ప్రధాన మంత్రి ని చంపింది ఎవరు? ఆ విషయం ఎలా తెలుసుకున్నారు? చివరికి ఏమయింది? అనేది సినిమా కథ.

నటీనటులు:

సూర్య అద్భుతమైన నటన ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ఎన్నడు చేయనటువంటి ఎనర్జిటిక్ పాత్రలో సూర్య చాలా చక్కగా నటించాడు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో సూర్య నటన సినిమాకి చాలా బాగా హెల్ప్ అయింది. తెరపై కనిపించేది తక్కువసేపే అయినప్పటికీ తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో మోహన్ లాల్ అందరి మనసులోనూ ఒక ముద్ర వేసుకున్నారు. ఆ పాత్రకి మోహన్ లాల్ తప్ప ఇంకెవరు సూట్ అవ్వరేమో అన్నంత బాగా తన పాత్రలో ఒదిగిపోయి నటించారు మోహన్ లాల్. ఆర్య నటన కూడా సినిమాలో చాలా బాగుంది. కమర్షియల్ హీరోయిన్ పాత్రలా కాకుండా సయేశా కి ఈ సినిమాలో చాలా చక్కని పాత్ర దక్కింది. తన అందమైన పర్ఫార్మెన్స్ తో సయేశా కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుంది. బొమన్ ఇరానీ మరియు చిరాగ్ జానీ పర్ఫామెన్స్ సినిమాకి చాలా బాగా సెట్ అయింది. పూర్ణ కూడా తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. సముద్రఖని మరియు తలైవసల్ విజయ్ కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయి చాలా బాగా నటించారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు.

సాంకేతిక వర్గం:

దర్శకుడు కె.వి.ఆనంద్ సినిమా కోసం చాలా చక్కని కథను ఎంపిక చేసుకున్నారు. కొన్ని స్ట్రాంగ్ క్యారెక్టర్లను సృష్టించిన కె.వి.ఆనంద్ ఒక ఆసక్తికరమైన కథను క్రియేట్ చేయడం మాత్రమే కాకుండా దానిని తెరపైన చాలా బాగా చూపించారు. ప్రేక్షకులకు ఎక్కడా బోరు కొట్టకుండా తన నెరేషన్ తో సినిమా అంతా కె.వి.ఆనంద్ చాలా బాగా ఆకట్టుకున్నారు. కె.వి.ఆనంద్ నెరేషన్ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై అల్లిరాజా శుభాస్కరన్ ఈ సినిమాకి మంచి నిర్మాణ విలువలను అందించారు. హ్యారీస్ జయరాజ్ అందించిన సంగీతం సినిమాకి వెన్నెముక గా చెప్పుకోవచ్చు. సినిమా పాటల విషయం పక్కన పెడితే సినిమాలో నేపథ్య సంగీతం కూడా ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసే విధంగా ఉంటుంది. ఎం ఎస్ ప్రభు అందించిన సినిమా కెమెరా యాంగిల్స్ మరియు అద్భుతమైన విజువల్స్ సినిమాని మరింత గ్రాండ్ గా మార్చాయి. అంథోనీ ఎడిటింగ్ కూడా పరవాలేదనిపిస్తుంది.

తీర్పు:

మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో ఒక సాలిడ్ కథ ఉండడం బాగా ఆకర్షిస్తుంది. ఒక మంచి కథని దర్శకుడు మరింత బాగా నెరేట్ చేయడంతో సినిమా మరింత ఆసక్తికరంగా మారింది. సినిమా మొదలైన అరగంటలోనే ప్రేక్షకులు కథతో బాగా కనెక్ట్ అయిపోతారు. సినిమా అంతా తర్వాత ఏం జరగబోతోంది అని ఆసక్తిని దర్శకుడు ప్రేక్షకులలో నింపారు అని చెప్పుకోవాలి. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఖచ్చితంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది. కథ నెరేషన్ ఇంకొంచెం ఫాస్ట్ గా ఉండి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. కానీ నటీనటులు తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా సినిమాని నడిపిస్తారు. నటీనటులు, నేపథ్య సంగీతం మరియు నెరేషన్ సినిమాకి ఆయువుపట్టుగా చెప్పుకోవచ్చు. కొన్ని సన్నివేశాలను కట్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. చివరగా ‘బందోబస్తు’ సినిమా కేవలం సూర్య అభిమానులు మాత్రమే కాక మిగతా అన్ని వర్గాల ప్రేక్షకులు చూడదగ్గ ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -