Friday, March 29, 2024
- Advertisement -

జైలుకి వెళ్లడం పై స్పందించిన యాంకర్ ప్రదీప్..!

- Advertisement -

బుల్లి తెరపై యాంకర్ ప్రదీప్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆయనకు మంచి క్రేజ్ ఉంది. ప్రధానంగా అమ్మాయిల ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ప్రస్తుతం ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. గతంలో పలు సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్లో కనిపించగా.. మొదటి సారి హీరోగా తన అదృష్టంను పరిష్కరించుకోనున్నాడు.

ప్రదీప్ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నవారికి సునిశిత్ అనే దర్శకుడు ప్రదీప్ పై కేసు పెట్టాడు. అమ్మాయిని వేదించిన కేసులో ప్రదీప్ రెండు రోజులు జైలుకు వెళ్లాడని.. సెంట్రల్ ఫిల్మ్ బోర్డ్ రూల్స్ ప్రకారం ప్రదీప్ హీరోగా చేసేందుకు అనర్హుడు. అందుకే ప్రదీప్ ను హీరోగా పరిచయం చేస్తున్న ఆ మూవీని వెంటే ఆపేయాలంటూ సునిశిత్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. గత రెండు రోజులుగా ఈ విషయంపై పెద్ద చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై ప్రదీప్ స్పందించాడు.

నేను జైలుకు వెళ్లినట్లు వస్తున్న వార్తలో ఎలాంటి నిజం లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో తాను కౌన్సిలింగ్ కు మాత్రమే వెళ్లాను. జైలుకు తాను వెళ్లినట్లుగా మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం అన్నాడు. నిజాలు తెలియకుండా ఇలాంటి అబద్దాలు రాయడం కరెక్ట్ కాదన్నారు. ఇక తనపై కేసు పేట్టిన సునిశిత్ ఎవరో కూడా తనకు తెలియదని.. అతని పేరు కూడా ఎప్పుడు వినలేదని చెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -