చైతు కుమార్తెతో రొమాన్స్ చేస్తున్న బెల్లంకొండ తమ్ముడు..!

398
bellamkonda romance with chaitus daughter
bellamkonda romance with chaitus daughter

బెల్లంకొండ సురేష్ పెద్ద కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీనీవాస్ ’అల్లుడు శీను’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ బాబు ను కూడా హీరోగా పరిచయం కానున్నాడు. ఇటీవలే అందుకు సంబంధించి సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. అయితే ఈ సినిమాలో గణేష్ సరసన ఎవరు నటించబోతున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. బెల్లంకొండ అయితే తన మొదటి సినిమాలో సమంతనే హీరోయిన్ గా ఎన్నుకున్న విషయం తెలిసిందే.

అయితే ఈ సారి చిన్న బాబు సరసన ఫామ్ లో ఉన్న హీరోయిన్ కాకుండా వేరేవాళ్లు అయితే బాగుంటుందని అలోచిస్తున్నారట. నాగచైతన్య, సమంత జంటంగా నటించిన చిత్రం మజిలీ. ఈ చిత్రంలో చైతు కుమార్తె గా చైల్డ్ ఆర్టిస్ట్ అనన్య అగర్వాల్ నటించింది. ఈమె బాలీవుడ్ సీరియల్స్ తో మంచి ఫెమస్. ఈమె వయసు తక్కువ అయినప్పటికి గణేష్ బాబు సరసన సరిగ్గా సరిపోతుందని అనన్యను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది.

అందుకు తోడు కథ కూడా టీనేజ్ లవ్ స్టోరీ కావడం తో అనన్య సరిగ్గా ఈ సినిమాకు సరిపోతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. ఇక ఈ సినిమాని ప్రేమ ఇష్క కాదల్, సావిత్రి సినిమల దర్శకుడు పవన్ సాధినేని తెరకెక్కిస్తున్నాడు. విభిన్న చిత్రాల దర్శకుడు వివేక్‌ ఆత్రేయ స్క్రీన్‌ప్లే ,మాటలు అందిస్తున్నారు.

Loading...