Friday, March 29, 2024
- Advertisement -

‘రాక్షసుడు’గా బెల్లంకొండ హిట్ అందుకోగలడా?

- Advertisement -

గత కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ మధ్యనే ‘సీత’ అనే సినిమాతో మరొక డిజాస్టర్ ను చవి చూశాడు. తాజాగా ‘రాక్షసుడు’ అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన ‘రాట్సాసన్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కనుంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఇవాళ విడుదలైంది.

కేవలం రెండే రెండు నిమిషాలు విడివిడిగా ఉన్న ఈ ట్రైలర్ ఇప్పుడు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ట్రైలర్ చూస్తే ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక సైకో కిల్లర్ నీ పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. సినిమా మొదలైన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మరి ఈ సినిమాతో అయినా బెల్లంకొండ హీరో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి. ఏ స్టూడియోస్ పతాకంపై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఘిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 2న విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -