Saturday, April 20, 2024
- Advertisement -

ఏపీ రాజకీయాలపై మహేష్ సంచలన కామెంట్స్‌

- Advertisement -

‘భరత్ అనే నేను’ టీజ‌ర్ రెడీ

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌ బాబు రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటారు.కాని రాజ‌కీయ నేప‌థ్యం ఉన్నా సినిమా చేస్తున్నారు. అదే కొర‌టల శివ ద‌ర్శ‌క‌త్వంలో ‘భరత్ అనే నేను’ నేను సినిమా చేస్తున్నాడు మ‌హేష్‌. ఈ సినిమా రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకోవడంతో ప్రమోషన్స్ వర్క్స్‌ను వేగవంతం చేసింది. ఏప్రిల్ 20న భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది‘భరత్ అనే నేను’ మూవీ.మహేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆడియోను ఫస్ట్ ఓథ్ పేరుతో విడుదల చేశారు చిత్ర యూనిట్‌. ఇప్పుడు రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వ‌డంతో టీజ‌ర్‌పై దృష్టి సారించారు.మూవీ టీజర్‌ను ఉగాది సందర్భంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.రాజ‌కీయానికి నేప‌థ్యంలో టీజ‌ర్ క‌ట్ చేయాలి అని కొర‌టాల శివ భావిస్తున్నాడు.

మ‌హేష్ బాబుతో మంచి ఫ‌వ‌ర్‌ఫుల్ డైలాగ్లు చెప్పించి సినిమా మీద మంచి హైప్ తీసుకురావ‌ల‌ని డైర‌క్ట‌ర్ ఆలోచ‌న‌. ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ సంబందించిన రాజ‌కీయ‌ల‌పై మ‌హేష్ బాబు డైలాగ్స్ ఉంటాయి అని స‌మాచ‌రం.ఈ మూవీలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వాని హీరోయిన్‌గా నటిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీమంతుడు’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తరువాత మహేష్-కొరటాల కాంబినేషన్‌లో మూవీ వస్తుండటంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మహేష్- కొరటాల ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఎలాంటి పంచ్‌లు విసరబోతున్నారన్నది ఆసక్తిగా మారింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -