Friday, March 29, 2024
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో మ‌హేష్ బాబు సినిమా

- Advertisement -

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు తాజా చిత్రం ‘భరత్‌ అనే నేను’ విడుద‌ల‌కు ముందే రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుంది.టాలీవుడ్‌లోనే అత్యధిక లైక్స్‌ సాధించిన టీజర్‌గా రికార్డు సృష్టించిన ‘భరత్‌ అనే నేను’ ఇప్పుడు మరో రికార్డు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది లైక్‌ చేసిన టీజర్లలో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఈ టీజర్‌ను 6,40,000 మంది లైక్‌ చేశారు. తొలి స్థానంలో హాలీవుడ్ చిత్రం ‘కెప్టెన్‌ అమెరికా: సివిల్‌ వార్’ ఉంది.  6,58,000 మంది ఈ టీజర్‌ను లైక్‌ చేశారు.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా చిత్ర బృందం తెలిపింది.దీంతో మ‌హేష్ అభిమాన‌ల ఆనందం అప‌లేక పోతున్నారు.కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కైరా అద్వానీ కథానాయికగా చెస్తుంది.ఏప్రిల్ 20న విడుద‌ల‌కు సినిమా రెడీగా ఉంది. విడుద‌ల‌కు ముందే ఇన్ని రికార్డులు సృష్టిస్తే విడుద‌ల త‌రువాత ఎన్నీ రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -