భూమిక విడాకులు తీసుకోబోతుందా?

3237
Bhumika Chawla to divorce Bharat Thakur?
Bhumika Chawla to divorce Bharat Thakur?

ఒక‌ప్పుడు హీరోయిన్‌గా న‌టించిన భూమిక ప్ర‌స్తుతం హీరోల‌కు అక్క క్యారెక్ట‌ర్లు చేస్తుంది. తాజాగా భూమిక గురించి ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. భూమిక త‌న భ‌ర్త భరత్ ఠాకూర్ నుంచి విడాకులు తీసుకుంటుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్తకు సంబంధించి భూమిక ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ను అడ‌గ్గా… వేణుగోపాల్ స్పందిస్తూ .. “భూమిక – భరత్ ఠాకూర్ ఎంతో అన్యోన్యంగా వుంటారు. ఇంతవరకూ వాళ్ల మధ్య ఎలాంటి మనస్పర్థలు రాలేదు .. ఇకముందు రావు కూడా.

ఎందుకంటే వాళ్ల గురించి నాకు బాగా తెలుసు. ఎవరో పనిలేని వాళ్లు ఈ పుకారును పుట్టించి వుంటారు. ఈ విషయం గురించి ఒకసారి మీడియా ముఖంగా క్లారిటీ ఇస్తారా? అని నేను భూమికను అడిగాను కూడా. పనిలేని వాళ్లు చేసే ప్రచారాలకు ఎందుకు స్పందించాలని ఆమె అన్నారు. వాళ్లిద్దరూ చాలా సంతోషంగా వున్నారనడంలో ఎవరికి ఎలాంటి సందేహం అవసరం లేదు” అని ఆయన అన్నారు.