అప్పుడే బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ రచ్చ మొదలైంది..?

368
big boss 4 wild card issue
big boss 4 wild card issue

బిగ్ బాస్ మొదలై ఇంకా వరం కూడా కాలేదు అప్పుడే సోషల్ మీడియా లో బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చే వారి పేర్లు బయటకు వస్తున్నాయి. బిగ్ బాస్ మెయిన్ కంటెస్టెంట్స్ విషయం లో సోషల్ మీడియాలో ఎంతోకాలం నుండి ఎన్నో పేర్లు వైరల్ అయ్యాయి. అలా వైరల్ అయిన లిస్టులో ఉన్న కంటెస్టెంట్స్ లో కొంతమంది నిజంగానే బిగ్ బాస్ లో ఉన్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎంపిక సమయంలో చాలా మార్పులు జరిగాయి.

అంటే ముందు కొంతమంది కంటెస్టెంట్ లను ఎంపిక చేసుకొని వారిని క్వారంటైన్ లో పెట్టారు. అప్పుడు ఆ కంటెస్టెంట్స్ లో కొంత మందికి కరోనా పాజిటివ్ రావడం, లేదా ఇంకేదైనా వేరే విషయాల కారణం గా ముందు అనుకున్న లిస్ట్ లో కొంతమంది కంటెస్టెంట్స్ రిప్లేస్ అయ్యారు అనే వార్తలు గత కొద్ది రోజులుగా సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే తాజాగా వైల్డ్ కార్డు ఎంట్రీ విషయంలో కూడా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న పేర్లు నిజమవ్వొచ్చు..

వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇవ్వబోయే ఆ సెలబ్రిటీలు ఎవరంటే జబర్దస్త్ అవినాష్, సాయి కుమార్ (ఈ రోజుల్లో, బస్ స్టాప్ ఫేమ్ ), స్వాతి దీక్షిత్ (జంప్ జిలాని ఫేమ్ ), వీరిలో ఎవరు ఒకరు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ లోకి వెళ్లడం ఖాయం అంటున్నారు. ఏదేమైనా బిగ్ బాస్ ఇప్పుడిప్పుడే రసవత్తరంగా మారుతున్న సంగతి తెలిసిందే..

Loading...