కంటతడి పెట్టిస్తున్న బిగ్ బాస్ ‘దివి” ప్రేమ కథ..మీరు వినండి..?

549
big boss beauty divi love story
big boss beauty divi love story

తెలుగులో వస్తున్న బిగ్ బాస్ 4 సీజన్ లో చాలానే కొత్త మొహాలు కనిపిస్తున్నాయి.. అయితే వారు సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోయినా ఇండస్ట్రీ వర్గాలకు మాత్రం సుపరిచియులే.. ఇక బిగ్ బాస్ లో ప్రస్తుతం తన గేమింగ్ తో ఎంతో మంది ని ఆకట్టుకుంటున్న దివి కి సంభందించిన ఓ విషయం ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. అయిత్ ముందు తనెవరో మనకి సడన్ గా గుర్తు రాలేదు.తర్వాత తను మహర్షి సినిమాలో ఉంది అని అందరికీ తెలిసింది. బిగ్ బాస్ ఇంట్రడక్షన్ ఎపిసోడ్ లో చెప్పిన ప్రకారం దివి ఒక మోడల్. దివి హైదరాబాద్ లోనే పుట్టి పెరిగారు. మాస్టర్స్ కంప్లీట్ చేసిన దివి కి యాక్టింగ్ పై ఉన్న ఇష్టంతో నటన వైపు దృష్టి పెట్టారు.

పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేయడం మొదలు పెట్టారు. వెబ్ సిరీస్ లో కూడా నటించారు. ఆ తర్వాత మహర్షి సినిమా లో మహేష్ బాబు క్లాస్ మేట్ గా నటించారు. సినిమాలో కనిపించింది కొన్ని సన్నివేశాల్లోనే అయినా బాగా రిజిస్టర్ అయ్యారు. మహర్షి సినిమా కంటే ముందు దివికి చాలా సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ రోల్ లో నటించమని ఆఫర్స్ వచ్చాయట. అయినా సైడ్ క్యారెక్టర్ నటించడం ఇష్టంలేక ఆ ఆఫర్స్ ని రిజెక్ట్ చేశారట. మహర్షి సినిమా ఆడిషన్స్ సమయంలో ఫ్రెండ్ రోల్ అని చెప్తే తనకి చేయడం ఇష్టం లేదు అని దర్శకుడు వంశీ పైడిపల్లి కి చెప్పారట దివి. అప్పుడు వంశీ పైడిపల్లి ఇది ఫ్రెండ్ రోల్ కాదు అని, మహేష్ బాబు ని ఫ్లర్ట్ చేసే రోల్ అని చెప్పారట. ఇంకా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి ఎదగాలి అని అన్నారట.

దివి వ్యక్తిగత విషయాల గురించి ఎవరికీ తెలీదు. కానీ ఇటీవల దివి తన లవ్ స్టోరీ చెప్పారు. సమయం కథనం ప్రకారం దివి ఒక అబ్బాయి తో రిలేషన్ లో ఉన్నారట. రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు బాగానే ఉన్నారట కానీ ఆ అబ్బాయి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఒక విషయం కారణంగా బ్రేకప్ అయిందట. ఆ అబ్బాయి వాళ్ళ తమ్ముడు చనిపోయారట. దాంతో ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో పరిస్థితులు మారాయట.  అప్పుడు అతను తనతో పాటు వాళ్ళ ఊరికి రమ్మని దివిని పిలిచారట. కానీ దివి వెళ్లలేదట. అయితే దివికి పల్లెటూరు అస్సలు అలవాటు లేదట. అయినా వెళ్ళేదాన్ని ఏమో అన్నారు దివి. అతను వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత వీళ్లిద్దరి మధ్య బాగా గ్యాప్ వచ్చిందట. దాంతో ఒకరి మీద ఒకరికి అండర్స్టాండింగ్ తగ్గిపోయిందట. అంతే కాకుండా అతను దివిని మోడలింగ్ ఇంకా సినిమాలు వదిలేయమని చెప్పారట. దివికి తనకు ఎంతో ఇష్టమైన ఈ కెరియర్ వదలడం ఇష్టం లేక రిలేషన్ షిప్ బ్రేక్ అయ్యిందట. ఇప్పుడు తనకిష్టమైన పని చేస్తూ సంతోషంగా ఉన్నారట దివి. విడిపోయినా కూడా ఇప్పటికీ అతని పై మంచి అభిప్రాయం ఉంది అని, అతను చాలా మంచి వ్యక్తి అని చెప్పారు దివి.

Loading...