Wednesday, April 24, 2024
- Advertisement -

బిగ్‌బాస్ హోస్ నుంచి శ్యామ‌ల బ‌య‌టికి రావ‌డానికి కార‌ణం ఇదేనా?

- Advertisement -

తెలుగు బిగ్‌బాస్ రెండో సీజ‌న్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది.ఆదివారం జ‌రిగిన ఎలిమినేష‌న్‌లో యాంక‌ర్ శ్యామల బిగ్‌బాస్ హౌస్ నుంచి బ‌యటికి వ‌చ్చింది.ఈ వారం ఎలిమినేష‌న్‌లో శ్యామల‌,దీప్తి,కౌశ‌ల్ అమీతు నామినేట్ అయిన సంగ‌తి తెలిసిందే.ఎలిమినేష‌న్‌లో భాగంగా మొద‌ట దీప్తిని సేవ్ చేసిన నాని ,త‌రువాత కౌశ‌ల్ సేవ్ అయినట్లు ప్ర‌క‌టించాడు.ఇక మిగిలింది శ్యామ‌ల‌,అమీత్‌.అంద‌రు అమీత్ ఎలిమినేట్ అవుతాడ‌ని భావించారు.కాని అనుహ్యంగా శ్యామ‌ల్ ఎలిమినేట్ అయింది.క‌నీసం అమీత్‌కు వ‌చ్చిన ఓట్లు కూడా శ్యామ‌లకు రాలేదా? అని అంద‌రు చ‌ర్చించుకుంటున్నారు.అయితే శ్యామ‌ల బ‌య‌టికి రావ‌డానికి ఆమె ప్ర‌వ‌ర్త‌నే కార‌ణం అని అంద‌రు భావిస్తున్నారు. మొద‌టిసారి ఎలిమినేట్ అయిన‌ప్పుడు శ్యామ‌ల‌పై అంద‌రికి సింప‌తి ఉంది.

ఈ సింప‌తితోనే తిరిగి హౌస్‌లోకి అడుగు పెట్టింది.శ్యామ‌ల రీఎంట్రీ ఇవ్వ‌డంలో కౌశ‌ల్ ఆర్మీ పాత్ర కూడా ఉంది అన‌డంలో ఎటువంటి సందేహం లేదు.అయితే రీఎంట్రీ త‌రువాత శ్యామ‌ల ప్ర‌వ‌ర్త‌న‌లో చాల‌నే మార్పులు చోటు చేసుకున్నాయి.చాలా తెలివిగా గేమ్ ఆడిన‌ట్లు క‌నిపించింది.కౌశ‌ల్‌కు మ‌ద్ద‌తు నిలుస్తుంద‌ని భావించిన‌ప్ప‌టికి ఆమె ఆ విధాంగా చేయ‌లేదు.దీంతో ఆమెపై వ్య‌తిరేక‌త ఎక్కువైంది.పైగా బ‌య‌ట జ‌రుగుత‌న్న విష‌యాల‌ను హౌస్‌మెట్స్‌తో చెప్ప‌కూడ‌దు అనే బిగ్‌బాస్ నిబంద‌న‌ను ఆమె అతిక్ర‌మించింది. ఈ కార‌ణంగానే శ్యామ‌ల హౌస్ నుంచి ఎలిమినేట్ అయిందని తెలుస్తుంది.ఇక శ్యామ‌ల బ‌య‌టికి రావ‌డానికి కౌశ‌ల్ ఆర్మీ పాత్ర కూడా ఉంది. కౌశ‌ల్ ఆర్మీ అమీత్‌కు ఎక్కువ ఒట్లు వేయ‌డంతో శ్యామ‌ల చివ‌రి స్థానంలో నిలిచి బ‌య‌టికి వ‌చ్చేసింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -