Wednesday, April 24, 2024
- Advertisement -

పునర్నవి అంటే పిచ్చి : రాహుల్ సిప్లిగంజ్

- Advertisement -

బిగ్ బాస్ లో ఎంతమంది ఉన్నప్పటికి.. రాహుల్ సిప్లిగంజ్, పునర్నవిలకు వచ్చినంత పేరు ఏ జంటకు రాలేదు. జనాల్లో ఈ జంటకు మంచి క్రేజ్ ఉంది. ఒక్కటి రెండు సినిమాల్లో నటించిన పునర్నవికి పెద్దగా క్రేజ్ లేదు.. ఇక పాటలు పాడే రాహుల్ కి కూడా పెద్దగా క్రేజ్ లేదు. కానీ బిగ్ బాస్ వల్ల వీరిద్దరికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

ఇక రాహుల్, పునర్నవి మధ్య లవ్ ఉందని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని.. ఇలా రకరకల వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. దీనిపై ఇప్పటివరకు ఇద్దరు స్పందించలేదు. కాకపొతే తామిద్దరం మంచి ప్రెండ్స్ అని మాత్రం చెబుతున్నారు. రీసెంట్ గా వీరిద్దరు కలిసి అలీతో సరదగా అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. అందులో అలీ అడిగిన ప్రశ్నలకు ఈ జంట సమాధనం ఇచ్చారు.

హౌస్ లో ఎవరు ఎక్కువగా ఇష్టమని అలీ అడగగా.. ఇంకెవరు పునర్నవి అని.. ఏ మాత్రం ఆలోచించకుండా చెప్పాడు రాహుల్. సాయం చేసిన వారాంత గుండెల్లో ఉంటారని అన్నాడు. అయితే అందరూ అక్కడ పట్టరు కదా అని పునర్నవి సెటైర్లు వేసింది. ఇక తన హౌస్ లో బాబా భాస్కర్ నచ్చలేదని పునర్నవి చెప్పింది. మరి నచ్చిన వ్యక్తి ఎవరని అడగగానే రాహుల్ వైపు చూస్తూ సిగ్గుపడింది. మీరు కూడా ఆ ప్రోమో చూసేండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -