Saturday, April 20, 2024
- Advertisement -

మా అక్క విన్నర్ కాదు : శ్రీముఖి తమ్ముడు..!

- Advertisement -

తెలుగు బిగ్ బాస్ మూడో సీజన్ ఆఖరి దశకు చేరుకోవడంతో ఎవరు విన్నర్ అవుతారు అనేదానిపై సర్వాత్రా ఆసక్తి నెలకొంది. టైటిల్ విన్నర్ ఎవరు అనేదానిపై జనాలు విపరితంగా ఆలోచిస్తున్నారు. వందరోజులు హౌస్ లో ఉంటూ చాలా క్రేజ్ సంపాధించుకున్నారు ఇంటి సభ్యులు. ఈ క్రమంలో టాప్ లో ఉన్న ఇంటి సభ్యుల అభిమానులు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు కామెంట్స్, కౌంటర్లు వేసుకుంటున్నారు.

కొంతమందైతే తమ అభిమాన ఇంటి సభ్యుడు గెలవాలని పాటలు, ర్యాలీలు, సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈ సీజన్ వల్ల కొత్త తరహా ప్రచారాలు కూడా వచ్చాయి. ఇక బుల్లితెర సెలబ్రిటీలు సైతం తమ ఫేవరెట్ కంటెస్టెంట్లకు ఓట్లు వేయండి అంటూ చెబుతున్నారు. ఈ శుక్రవారంతో ఓటింగ్ ముగిసింది. దాంతో తమ అభిమాన కంటెస్టెంట్ గెలుస్తాడు అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ కి దిగుతున్నారు.

అయితే ఈపాటికే విన్నర్ ఎవరో తెలిసిపోయిందని సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో శ్రీముఖి బిగ్ బాస్ టైటిల్ తో కనిపిస్తోంది. స్టేజీపై ఉన్న నాగార్జున టైటిల్ గెలుచుకున్న శ్రీముఖిని అభినందించడం ఫోటోలో చూడవచ్చు. ఇది చూసిన బిగ్ బాస్ ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఇది నిజమేనా అంటూ కంగారు పడ్డారు.

దాంతో ఈ వైరల్ ఫోటోపై శ్రీముఖి తమ్ముడు శుశ్రుత్ నోరు విప్పాడు. ’అది ఫేక్ ఫోటో..ఇంకా ఫినాలే కంప్లీట్ కాలేదు. ఎవరూ దాన్ని నమ్మకండి’ అంటూ జనాలకు క్లారిటీ ఇచ్చాడు. దాంతో మిగితా కంటెస్టెంట్ల అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ప్రస్తుతం రాహుల్ , శ్రీముఖి మధ్య గట్టి పోటీ నడుస్తోంది. వీరిద్దరిలో రాహులు గెలిచే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -