Thursday, April 25, 2024
- Advertisement -

దివి ప్రేమించిన అబ్బాయిని ఎందుకు వదిలేసిందో తెలుసా ?

- Advertisement -

‘బిగ్ బాస్4’ లోని ఇంటి సభ్యుల్లో దివి అనే అమ్మాయి కుర్రాళ్ల మతి పోగొడుతున్న విషయం తెలిసిందే. హౌస్ లో సైలెంట్ గా ఉంటూనే అందరిని గమనిస్తూ అందరి గురించి ఓ ఎపిసోడ్ లో అద్భుతంగా ఎక్స్ ప్లేన్ చేసింది. అప్పటి నుంచి దివికి ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఈమె మహేష్ బాబు ‘మహర్షి’ చిత్రంలో నటించింది అని తెలియగానే.. మహేష్ ఫ్యాన్స్ ఈమెను ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. ఈమె తల్లిదండ్రులు హైదరాబాద్ లోనే సెటిల్ అవ్వడంతో దివి పుట్టి పెరిగిందంతా కూడా హైదరాబాద్లోనే జరిగింది.

ఇంత సైలెంట్ గా ఉండే దివికి ఒక బ్రేకప్ లవ్ స్టోరీ ఉందట. దివి మాట్లాడుతూ.. “గతంలో ఓ వ్యక్తిని ప్రేమించాను. కొన్నాళ్ళ పాటు రిలేషన్ లో ఉన్నాం. తర్వాత బ్రేకప్ అయింది. ప్రస్తుతం నా లైఫ్ లో ఎవరు లేరు. సింగిల్ గానే ఉండటం బాగుంది. బెటర్ అని కూడా ఫిక్సయ్యాను. సింగిల్‌గా ఉంటే మనకు నచ్చినట్టు ఉండొచ్చు. హ్యాపీగా ఉండొచ్చు. నేను రిలేషన్ షిప్‌లో ఉన్నప్పుడు కూడా కరెక్ట్ గానే ఉన్నాను.. కానీ ఇద్దరి మధ్య కొన్ని అనుకోని పరిస్థితులు ఏర్పడటం వల్ల బ్రేకప్ అవ్వాల్సి వచ్చింది.

అతని కుటుంబంలో చిన్న ప్రాబ్లమ్ వచ్చింది. ఇప్పటికీ అతనిపై మంచి అభిప్రాయమే ఉంది. అతను మంచి వ్యక్తి. ఆ అబ్బాయి.. తమ్ముడు దురదృష్టవశాత్తు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. దాంతో అతని ఇంట్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ టైములో తనతో పాటు వాళ్ల పల్లెటూరికి రమ్మని నన్ను అడిగాడు. కానీ నేను వెళ్లలేదు. నేను చిన్నప్పటి నుండీ హైదరాబాద్‌లోనే పెరగడం వల్ల పల్లెటూరు నాకు అలవాటు లేదు. అయినా అతని కోసం వెళ్లేదాన్నేమో..! కానీ నాకు ఇష్టమైన మోడలింగ్.. ఇంకా సినిమాలు వదిలేయమని అతను నాతో చెప్పాడు. అది నాకు ఇష్టం లేదు. అందుకే ఇద్దరికి బ్రేకప్ జరిగింది” అని దివి చెప్పుకొచ్చింది.

పెళ్లి చేసుకోబోతున్నా.. అందుకే షోస్ చేయట్లేదు : శ్రీముఖి

రష్మీ పెళ్లి కాబోతుంది.. సుధీర్ కాదు.. అసలు వ్యక్తి వేరే ఉండు ?

బిగ్‌బాస్‌ 4: దోస్తులే.. పగ పట్టారు.. ఈ వారం బయటకు వెళ్లేది ఎవరంటే ?

పవన్ కళ్యాణ్ అభిమానులపై ఫైర్ అయిన అనసూయ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -